📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి!

Telugu News: PAK: పాకిస్థాన్ ను సీరియస్ గా హెచ్చరించిన ప్రపంచ బ్యాంకు

Author Icon By Sushmitha
Updated: November 17, 2025 • 5:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ (PAK) తన సొంతదేశంలో టెర్రరిజాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలినో తెలిసినంతగా మరె ఇతర రంగాల్లో తెలియదు. ఒకవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే మరోవైపు ఆదేశ ప్రధాని భారత్ తో తాము యుద్ధాన్ని సిద్ధమంటూ డాంబికాలు పలుకుతున్నారు. నిత్యం భారత్ పై ఏదో ఒక విషయంలో నిందిస్తూ, కాలం గడుపుతున్నారే తప్ప తమ సొంతదేశంలో ప్రజల జీవనస్థితిగతులు ఏమిటో గ్రహించలేని స్థితిలోఉంది. 

Read Also: Library : విజ్ఞాన, సంస్కృతుల నిలయం గ్రంథాలయం

World Bank issues serious warning to Pakistan

అందుకే ప్రపంచ బ్యాంక్ (World Bank) ఆదేశ స్థితిని చూపి, ఆందోళన వ్యక్తం చేస్తున్నది. తాజాగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఎగుమతుల సంక్షోభం తాత్కాలిక సమస్య కాదని, దశాబ్దాలుగా పేరుకుపోయిన లోతైన వ్యవస్థాగత లోపాల ఫలితమని ప్రపంచ బ్యాంకు తీవ్రంగా హెచ్చరించింది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే తక్షణమే కీలక సంస్కరణలు చేపట్టాలని సూచించింది. ఈ మేరకు ‘ది న్యూస్ ఇంటర్నేషనల్’ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో పాకిస్థాన్ బలహీనమైన ఎగుమతులకు గల కారణాలను విశ్లేషించింది. అస్థిరమైన విధానాలు, వక్రీరించిన మార్కెట్లు,  సంస్కణలను అమలు చేయడంలో నిరంతర వైఫల్యమే ప్రస్తుత దుస్థితికి కారణమని స్పష్టం చేసింది. 1990లలో పాక్ జీడీపీలో ఎగుమతుల వాటా 16శాతంగా ఉండగా, 2024 నాటికి అది కేవలం 10 శాతానికి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ఇదే సమయంలో భారత్, బంగ్లాదేశ్, వియత్నాంవంటి దేశాలు ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధిని సాధించాయని గుర్తు చేసింది. సరైన విధానాలు లేకపోవడం వల్ల పాకిస్తాన్ దాదాపు 60 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులను కోల్పోతోందని అంచనా వేసింది.

కరెన్సీ మార్పిడిపై ప్రపంచవవ్యాంకు ఆందోళన

పాకిస్తాన్ అనుసరిస్తున్న కరెన్సీ మార్పిడి రేటు విధానంపై ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. రాజకీయ కారణాలతో కరెన్సీ రేటును నియంత్రించడం మానేసి, పూర్తిగా మార్కెట్ ఆధారిత విధానాన్ని అనుసరించాలని సూచించింది. దీనివల్ల ఎగుమతులు పెరిగి, విదేశీ పెట్టుబడులు ఆకర్షితమవుతాయని తెలిపింది. వ్యాపార నిర్వహణకు అవుతున్న అధిక వ్యయం కూడా పాక్ పోటీతత్వాన్ని దెబ్బతీస్తోందని నివేదిక పేర్కొంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

debt management financial crisis global financial institutions. Google News in Telugu Latest News in Telugu Pakistan economy; Telugu News Today World Bank warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.