పాకిస్తాన్, ఆఫ్ఘనిసతాన్..రెండు సరిహద్దు దేశాలు. ఇప్పుడు ఇవి రెండు దాడులు చేుకుంటున్నా. పాకిస్తాన్ మొదలెట్టిన ఈ మారణహోమంలో తాలిబన్లు(Taliban) తమ ప్రతాపం చూపిస్తున్నారు. బోర్డర్ల దగ్గర పాక్ సైనికులను తరిమి కొడుతున్నారు. ఈక్రమంలో ఆఫ్ఘాన్లు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నప్పటికీ పై చేయి మాత్రం వారిదే అని తెలుస్తోంది. అయితే ఈ కాల్పులకు రెండు దేశాలు 48 గంటలు విరామం ప్రకటించాయి. ఈ క్రమంలో తాలిబన్ యోధులు పాకిస్తాన్(Pakistan) సైనికుల ప్యాంటును తమ ఆయుధాలకు వేలాడదీసి సంబరాలు చేసుకున్నారు.
Read Also: Pak-Afghan: పాక్–ఆఫ్ఘాన్ కాల్పుల విరమణ
పాక్ ఆయుధాలను దోచుకున్న తాలిబన్లు
పాక్, ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని డ్యూరాండ్ లైన్ సమీపంలోని తమ పోస్టుల నుండి పాక్ ఆర్మీ పారిపోయారని చెబుతున్నారు. ఇలా పారిపోతున్నప్పుడు తాలిబన్లు వారి దగ్గర నుంచి ఆయుధాలను దోచుకున్నారు. దాంతో పాటూ పాక్ సైనికులు ప్యాంట్లను ఊడబెరికి మరీ పంపించారు. దీని తరువాత తాలిబన్లు ఆ ఫ్యాంట్లను వీధుల్లో ఊరేగిస్తూ సంబరాలు చేసుకున్నారు. తమ తుపాకులను పాక్ సైన్యం ప్యాంటను వేలాడదీసి విజయాన్ని ప్రకటించుకున్నారు. తాలిబన్ల ఎదురుదాడి సమయంలో పాకిస్తాన్ సైనికులు డ్యూరాండ్ లైన్ సమీపంలోని తమ స్థావరాల నుండి పారిపోయారని ఆఫ్ఘన్ జర్నలిస్ట్ దావుద్ జున్‌బిష్ నివేదించారు.
బలోచిస్తాన్ ప్రాంతంలో తాలిబన్లు దాడులు
మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించాక కూడా పాకిస్తాన్ దాడులకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ తర్వాత కూడా పాక్, ఆఫ్గాన్ లు ఘర్షణ పడ్డాయి. బోర్డర్ వెంబడి పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘర్షణల్లో 40 మందికిపైగా అఫ్గాన్ తాలిబన్లను హతమార్చామని పాక్ సైన్యం తెలిపింది. బలోచిస్తాన్ ప్రాంతంలో తాలిబన్లు దాడులకు తెగబడ్డారని..సామాన్యుల మీద కూడా కాల్పులు జరిపారని పాక్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతిగానే తాము దాడులను నిర్వహించామని చెప్పింది. ఈ ఘర్షణల్లో నిషేధిత తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ముష్కరుల ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: