📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pak: ఆఫ్ఘాన్ పై పాక్ వైమానిక దాడులు.. పదిమంది మృతి

Author Icon By Sushmitha
Updated: November 25, 2025 • 2:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇటీవల పాక్, (Pak) ఆఫ్ఘాన్ లమధ్య దాడులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్ భారత్ తో తన స్నేహసంబంధాలను పెంపొందించుకోవడం పాక్ కు ఏమాత్రం గిట్టడం లేదు. అందుకే మాటిమాటికి పాక్ ఆదేశంపై దాడులకు పాల్పడుతూ, అమాయక ప్రజల ప్రాణాలను తీస్తున్నది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ పై మరోసారి పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో పదిమంది మరణించగా నలుగురు గాయపడినట్లుగా ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. 

Read Also: Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Pakistani airstrikes on Afghans.. ten killed

సోమవారం రాత్రి 12గంటల సమయంలో ఖోస్ట్ ప్రావిన్స్ లోని గోర్బుజ్ జిల్లాలో దాడి జరిగినట్లుగా ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం తెలిపారు. 9మంది పిల్లలు చనిపోయినట్లుగా పేర్కొన్నారు. అనంతరం చికిత్స పొందుతూ మహిళ కూడా చనిపోయినట్లుగా వెల్లడించారు. మొత్తంగా పదిమంది మరణించినట్లు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా మాజీ రాయబారి జల్మయ్ ఖలీల్దాద్

దౌత్యానికి పిలుపునిచ్చిన అమెరికా మాజీ రాయబారి కునార్, పార్టికాలో వైమానికి దాడులు జరిగాయని.. ఇక్కడ నలుగురు పౌరులు గాయపడినట్లు తెలిపారు. తాజా దాడుల నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ లో అమెరికా (America) మాజీ రాయబారి జల్మయ్ ఖలీల్దాద్ దౌత్యానికి పిలుపునిచ్చారు. ఇక ఇరుదేశాల మధ్య సయోధ్య కోసం టర్కీకి చెందిన ఒక బృందం ఇస్లామాబాద్, కాబూల్ లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొద్దిరోజులుగా రెండు దేశాలమధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగాయి. కానీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్ భారత్ తో సఖ్యతగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆఫ్ఘనిస్థాన్ పై పాక్ వైమానిక దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Afghanistan border civilian casualties cross-border conflict Google News in Telugu Latest News in Telugu Pakistan airstrikes regional tensions Taliban government. Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.