📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Pak-పాక్-భారత్ యుద్ధం.. హతమైన అజహర్ కుటుంబం

Author Icon By Vanipushpa
Updated: September 16, 2025 • 4:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గాం దాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ పై ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)పేరుతో యుద్ధం చేసింది. ఈ యుద్ధంలో భారత్ దే పైచేయిగా అయ్యింది. యుద్ధంతో భారీగా నష్టపోయిన పాక్ యుద్ధానికి ముగింపు పలకాలని కాళ్లబేరానికి వచ్చింది. దీంతో రెండుదేశాల మధ్య కాల్పుల ఒప్పందానికి వచ్చాయి. అయితే భారత్ ప్రధానంగా పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు భారత్ చేతిలో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయాన్ని ఆ సంస్థ తొలిసారిగా బహిరంగంగా అంగీకరించింది. భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేసన్ ‘సిందూర్’ లో భాగంగా పాకిస్తాన్ లోని బహావల్ పూర్ లో జరిపిన వైమానిక దాడిలో తమ అధినేత మసూద్ అహజర్(masood azhar) కుటుంబ సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. ఈ మేరకు జైష్ అగ్ర కమాండర్లలో ఒకరైన మసూద్ ఇలియాస్ కశ్మీర్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.

పాక్-భారత్ యుద్ధం.. హతమైన అజహర్ కుటుంబం

అజార్ కుటుంబాన్ని ఛిద్రం చేసిన మనసైన్యం
మే 7వ తేదీన బహవల్ పూర్ ని జైషే ప్రధాన కార్యాలయం ‘జామియా మసీదు సుభాన్ అల్లాపై భారత బలగాలు జరిపిన దాడిలో మసూద్ అజహర్(masood azhar) కుటుంబం తీవ్రగా నష్టపోయిందని ఆ కమాండర్ పేర్కొన్నాడు. ‘మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని మన బలగాలు ఛిద్రం చేశాయి’ అని కశ్మీర్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ దాడిలో అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, మేనకోడలు, ఇతర సమీప బంధువులు మొత్తం 10మంది మరణించినట్లు సమాచారం. వారితోపాటు అజహర్ ప్రధాన అనుచరులైన నలుగురు సహాయకులు కూడా హతమయ్యారు. మసూద్ అజహర్ 2016 పఠాన్ కోట్, 2019 పుల్వామా(pulwama attack) దాడుల వెనుక ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదురొంటున్నాడు. తాజా నిఘా సమాచారం ప్రకారం, అజహర్ తన స్థావరమైన బహావల్ పూర్కు వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బల్టిస్థాన్ ప్రాంతంలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది.

సిందూర్ ఆపరేషన్ వికీపీడియా అంటే ఏమిటి?
2025 మే 7న, పాకిస్తాన్ ఆక్రమిత ఆజాద్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని తొమ్మిది స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సిందూర్ అనే సంకేతనామంతో క్షిపణి మరియు వైమానిక దాడులను ప్రారంభించినట్లు భారతదేశం ప్రకటించింది.
ఆపరేషన్ సిందూర్‌లో ఎంతమంది మరణించారు?
26 మంది మరణించారు. ఏప్రిల్ 22న, పహల్గామ్‌లో ఉగ్రవాదం చెలరేగింది. పాకిస్తాన్ మద్దతు ఉన్న దుండగులు ఒక గ్రామంలోకి చొరబడి, ప్రజలను వారి మతం ఏమిటని అడిగి, వారిని చంపారు, ఫలితంగా 26 మంది మరణించారు

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/america-nagamallaiahs-murder-what-are-they-saying/international/548343/

Azhar Family cross border tensions Google news Google News in Telugu Indian News Latest News in Telugu Pakistan news Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.