हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: PAK: షరీఫ్ మునీర్‌ పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

Sushmitha
Telugu News: PAK: షరీఫ్ మునీర్‌ పై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్(PAK) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్,(Imran Khan) ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, మానసికంగా అస్థిరమైన వ్యక్తి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఖైదీగా ఉన్న ఇమ్రాన్ ఈ ఆరోపణలను ‘ఎక్స్’ (X) వేదికగా చేశారు. మునీర్ పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని, అధికార దాహంతో కళ్లుమూసుకుపోయిన ఆయన దాని కోసం ఎంతకైనా తెగిస్తారని దుయ్యబట్టారు.

Read Also: TTD: భక్తులకు గుడ్ న్యూస్.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

 PAK
PAK

హింస, దుర్వినియోగంపై ఆరోపణలు

మే 9, నవంబర్ 26 మురిడ్కే ఘటనలను ప్రస్తావిస్తూ, ఇవి అధికార దుర్వినియోగానికి స్పష్టమైన ఉదాహరణలని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు. పోలీసులు, భద్రతా సిబ్బంది తమ పార్టీ (పీటీఐ) కార్యకర్తలను హత్య చేశారని ఆరోపించారు. “నిరాయుధులైన పౌరులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ఏ నాగరిక సమాజంలోనూ ఊహించలేం. మహిళలపై ఇంతటి క్రూరత్వం గతంలో ఎన్నడూ చూడలేదు” అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా, తన భార్య బుష్రా బీబీని ఏకాంత నిర్బంధంలో ఉంచి అసీమ్ మునీర్ వేధిస్తున్నారని ఇమ్రాన్(Imran) ఆరోపించారు. “బానిసత్వంలో బతకడం కన్నా మరణమే మేలు. అసిమ్ మునీర్ నాపై, నా భార్యపై అన్ని రకాల అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడి కుటుంబం కూడా ఇంతటి క్రూరత్వాన్ని ఎదుర్కోలేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “ఆయన ఎన్ని చేసినా సరే, నేను తలవంచను, లొంగిపోను” అని ఇమ్రాన్ స్పష్టం చేశారు.

చర్చలకు నిరాకరణ

ప్రస్తుత ప్రభుత్వంతో సయోధ్యకు వెళ్లే ప్రసక్తే లేదని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ‘కీలుబొమ్మ ప్రభుత్వం’తో గానీ, సైనిక నాయకత్వంతో గానీ తమ పార్టీ చర్చలు జరపదని అన్నారు. “సమాధానం చెప్పే ముందు అనుమతి తీసుకునే ప్రధాని ఉన్న కీలుబొమ్మ ప్రభుత్వంతో మాట్లాడటం వృథా” అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో చర్చలకు ప్రయత్నించిన ప్రతిసారీ అణచివేత పెరిగిందని, అందువల్ల చర్చలు అర్థరహితమని ఆయన పేర్కొన్నారు.

ఇమ్రాన్ ఖాన్ ఎవరిపై తీవ్ర ఆరోపణలు చేశారు?

పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై.

అసీమ్ మునీర్‌పై ఇమ్రాన్ చేసిన ప్రధాన ఆరోపణ ఏమిటి?

మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంత అని, ఆయన పాలనలో అణచివేత గతంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఉందని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870