పాకిస్థాన్,(Pak) అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరుకున్నాయి. తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) తాలిబన్ ప్రభుత్వానికి గట్టి యుద్ధ హెచ్చరిక జారీ చేశారు. గురువారం ఇస్తాంబుల్‌లో జరగనున్న శాంతి చర్చలు విఫలమైతే, యుద్ధానికి వెళ్లక తప్పదని ఆయన స్పష్టం చేశారు. “శత్రువులు మమ్మల్ని ఎలా లక్ష్యంగా చేసుకుంటారన్న దాన్ని బట్టి, మా ప్రతిస్పందన అంతే తీవ్రంగా ఉంటుంది” అని ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ఈ హెచ్చరికతో ఇరు దేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
Read Also: Viral Video: భోజనం ధర తెచ్చిన తంటా.. రైల్లో సిబ్బంది దాష్టీకం
పాక్ ఆగ్రహానికి ప్రధాన కారణాలు
పాకిస్థాన్ ఆగ్రహానికి ప్రధాన కారణం టీటీపీ ఉగ్రవాదులు. అఫ్గాన్ భూభాగాన్ని ఉపయోగించుకుంటూ, ఈ ఉగ్రవాదులు ఇటీవల పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ఓరక్‌జాయ్ జిల్లాలో దాడులు చేశారు. ఈ దాడిలో లెఫ్టినెంట్ కర్నల్, మేజర్ సహా ఏకంగా 11 మంది సైనికులు మరణించారు. మిలిటెంట్లకు అఫ్గాన్ రాజధాని కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని, సీమాంతర దాడులను ప్రోత్సహిస్తోందని పాక్ మంత్రి ఆరోపించారు. అయితే, పాక్ ఆరోపణలను అఫ్గాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలోని సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ దాడులకు పాల్పడుతోందని తాలిబన్ మండిపడింది.
ఇస్తాంబుల్‌లో మూడో విడత చర్చలు
సరిహద్దులో జరుగుతున్న ఘర్షణలు, దాడులను పరిష్కరించుకోవడానికి ఈరోజు (గురువారం) తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా అఫ్గాన్-పాక్ మధ్య మూడో విడత శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలకు ఖతార్, తుర్కియే దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. అంతకుముందు దోహా, ఇస్తాంబుల్‌లో జరిగిన రెండు విడతల చర్చల్లో ఎలాంటి ఒప్పందాలు కుదరలేదు. తమ దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాదులను అఫ్గాన్ భూభాగం నుంచి నిరోధించాలని కాబుల్‌ను కోరినప్పటికీ, హామీ లభించలేదని పాక్ అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: