📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: భారత ఎయిర్ బేస్‌లపై పాక్ ఫేక్ ప్రచారం: ఖండించిన ఇండియా

Author Icon By Shobha Rani
Updated: May 10, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్‌ (Pakistan) మనపై చేస్తున్న దాడులపై ప్రతిదాడిగా పాక్‌లోని ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసినట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ వెల్లడించారు. పాకిస్థాన్‌లోని చక్లాలా, మురిద్, రహిమ్యార్ ఖాన్, రఫీకి ఎయిర్ బేస్‌లను భారత్ ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు పాకిస్థాన్‌ మన ఎయిర్‌ బేస్‌లపై దాడి చేసినట్లు సోషల్‌ మీడియాలో ఫేక్‌ ప్రచారం చేసుకుంటున్నట్లు కూడా ఆయన ఆరోపించారు. ఈ ఉదయం, పాకిస్తాన్ రాజౌరి పట్టణంపై షెల్ దాడి చేసింది, అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ థాపా మరణించారు, పౌరుల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో కల్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌ పాల్గొని మరిన్ని విషయాలు వెల్లడించారు.

Pakistan: భారత ఎయిర్ బేస్‌లపై పాక్ ఫేక్ ప్రచారం: ఖండించిన ఇండియా

పాక్ రక్షణ సదుపాయాలపై విస్తృత దాడులు
రఫీకి, మురిద్, చక్లాలా, రహీమ్ యార్ ఖాన్‌లోని పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. సుక్కూర్, చునియాలోని పాకిస్తాన్ సైనిక స్థావరాలు, పస్రూర్‌లోని రాడార్ సైట్, సియాల్‌కోట్ విమానయాన స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపారు. భారతదేశ పశ్చిమ సరిహద్దులో చేపట్టే చర్యలతో భారత్‌ను పాక్‌ రెచ్చగొడుతోందని అన్నారు. పౌర ప్రాంతాలు, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మానవరహిత యుద్ధ వైమానిక వాహనాలు, క్షిపణులు, ఫైటర్ జెట్‌లను ఉపయోగించిందని తెలిపారు. “భారత సాయుధ దళాలు వీటిని చాలావరకు అడ్డుకున్నాయి. అయితే, ఉధంపూర్, పఠాన్‌కోట్, అడంపూర్, భుజ్‌లోని భారత వైమానిక దళ స్టేషన్లలోని పరికరాలు, సిబ్బందికి పరిమిత నష్టం వాటిల్లింది” అని వారు పేర్కొన్నారు. ఇండియాలో ఎయిర్‌ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాకిస్థాన్‌ అబద్ధాలు ప్రచారం చేస్తుందని అని అన్నారు. పాక్‌ ప్రచార ఫేక్‌ అని కొన్ని ఫొటోలు కూడా చూపించారు.

Read Also: Pakistan :పాకిస్తాన్‌కు ఐఎంఫ్ నుంచి 100 కోట్ల డాలర్ల విడుదల..

Breaking News in Telugu Google news Google News in Telugu on Indian Air Bases: India Condemns Pak Fake Campaign Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.