📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Pak: ఢిల్లీ పేలుడు.. మళ్లీ యుద్ధానికి రెడీ..ఖవాజా ఆసిఫ్

Author Icon By Sushmitha
Updated: November 13, 2025 • 5:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకవైపు ఢిల్లీలో బాంబు పేలుడుపై దేశం మొత్తం తీవ్ర విచారంలో ఉంటే పాకిస్తాన్(Pak) మాత్రం మళ్లీ తన అక్కసును వెళ్లగక్కుకుంటున్నది. ఒకవైపు తన దేశ ప్రజల స్థితిగతులపై ఏమాత్రం దృష్టి సారించకుండా, వారికి మెరుగైన సదుపాయాలను కల్పించే విషయంలో విఫలమై.. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నా.. 

పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నది పాకిస్తాన్. తాజాగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి తీవ్రస్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతర్గతంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ.. తమ దేశం భారత్ (తూర్పు సరిహద్దు), అఫ్గానిస్థాన్ (పశ్చిమ సరిహద్దు)లతో ఒకేసారి యుద్ధానికి పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఓ బహిరంగ కార్యక్రమంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ‘మేం రెండు వైపులా యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాం. తూర్పు (భారత్), పశ్చిమ సరిహద్దు (అఫ్గానిస్థాన్) రెండింటినీ ఎదుర్కోవడానికి మేం పూర్తి సన్నద్ధతతో ఉన్నాం. మొదటి అంకంలో అల్లా మాకు సాయం చేశాడు. రెండో అంకంలోనూ ఆయనే మాకు సాయం చేస్తాడు’ అంటూ సంచలన ప్రకటన చేశారు.

Read Also: Health: చలికాలం లో చర్మం సాఫ్ట్‌గా ఉండాలంటే?

Pak

భారత్ పై నిందలు కొత్తేమీ కాదు..

ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) ఈ వ్యాఖ్యలు చేయడానికి కొన్ని రోజుల ముందే ఇస్లామాబాద్ లో పాకిస్తానీ తాలిబాన్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 12మంది మరణించగా.. 35మంది గాయపడ్డారు. ఈ దాడికి టిటిపి బాధ్యత వహించినప్పటికీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాత్రం ‘భారత్ మద్దతుతో పని చేసే గ్రూపులు’ ఈ దాడిలో పాలుపంచుకున్నాయని ఆరోపించారు. అయితే ఖవాజా ఆసిఫ్ మరో అడుగు ముందుకేసి..ఈ ఆత్మాహుతి దాడిని ‘ఆఫ్గాన్ తాలిబాన్ పంపిన సందేశం’గా అభివర్ణించారు. ‘ఇస్లామాబాద్ వరకు ఈ యుద్ధాన్ని తీసుకురావడం కాబూల్ పాలకుల నుంచి వచ్చిన సందేశం. దీనికి దీటుగా బదులిచ్చే పూర్తి శక్తి పాకిస్తాన్ కు ఉంది’ అంటూ ఎక్స్ లో వెల్లడించారు.

అది గ్యాస్ సిలండర్ వల్ల పేలిందంట: పాక్

ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు గురించి స్పందిస్తూ అది కేవలం గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల మాత్రమే జరిగిందని వెల్లడించారు. నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలు. ఇప్పుడు దాన్ని విదేశీ కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో భారత్ దానిని పాకిస్తాన్ పై నింద వేయడానికి ప్రయత్నించవచ్చు’ అని ఆరోపించారు. ఇండియన్ అధికారులు మాత్రం కావాలనే పాక్ ఇలా మాట్లాడుతోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

delhi blast Geopolitical statement Google News in Telugu India-Pakistan Tensions Khawaja Asif Latest News in Telugu National Security Pakistan Defense Minister Telugu News Today War rhetoric

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.