📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pakistan: అమెరికాకు రెండోసారి పాక్ ఆర్మీ చీఫ్ పయనం

Author Icon By Vanipushpa
Updated: August 7, 2025 • 1:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్(Pakistan Army Cheif Munir Asim) రెండు నెలల వ్యవధిలోనే రెండోసారి అమెరికా(America) పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన పాకిస్తాన్, అమెరికా(Pakistan-America) మధ్య పెరుగుతున్న సంబంధాలను సూచిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నెలలో సెంట్రల్ కమాండ్ (CENTCOM) జనరల్ కురిల్లా పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మునీర్ వాషింగ్టన్ వెళ్తున్నట్లు సమాచారం.

మునీర్‌ పర్యటనల పైన విశ్లేషణ
2025 జూన్ నెలలో అమెరికా సైనిక దినోత్సవం సందర్భంగా మునీర్ అమెరికాను సందర్శించారు. అప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో ఆయనకు ప్రత్యేకంగా విందు ఇచ్చారు. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఒక కీలక పరిణామంగా పరిగణించబడింది. ఆ సమయంలో భారతదేశం-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అధికంగా ఉన్న నేపథ్యంలో మునీర్ పర్యటనకు ప్రాధాన్యత లభించింది.

Pakistan: అమెరికాకు రెండోసారి పాక్ ఆర్మీ చీఫ్ పయనం

అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం
తాజా పర్యటనలో మునీర్ అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమవుతారని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. పాకిస్తాన్లో చైనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా పాకిస్తాన్తో తమ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి నిదర్శనంగానే మునీర్కు తరచుగా అమెరికా నుంచి ఆహ్వానాలు వస్తున్నాయని పేర్కొన్నారు.

భారతదేశానికి ఒక హెచ్చరిక

అసిమ్ మునీర్ ఈ పర్యటనలో ట్రంప్ తో సమావేశమవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ, ఈ తరహా ఉన్నత స్థాయి పర్యటనలు భారతదేశానికి ఒక హెచ్చరికగా పరిణమించవచ్చని భావిస్తున్నారు. అమెరికా ఒకవైపు భారతదేశాన్ని తన మిత్రదేశంగా చెబుతూనే, మరోవైపు పాకిస్తాన్తో రక్షణ బంధాలను బలోపేతం చేసుకోవడం భారత్కు సవాలుగా మారవచ్చని పలువురు నిపుణులు హెచ్చరించారు. ఈ పరిణామాలు దక్షిణ ఆసియాలో భవిష్యత్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటం పై చర్చ, ప్రాంతీయ భద్రత, రక్షణ సహకారం.
చైనా ప్రభావం నేపథ్యంలో అమెరికా వ్యూహాత్మక దృష్టి
భారతదేశం కోసం ఉన్న అవకాశాలూ, సవాళ్లూ, మునీర్ పర్యటనతో భారత భద్రతపై ప్రభావం?, అమెరికా ద్వంద్వ విధానం పై నిపుణుల ఆందోళనలు, దక్షిణాసియాలో సమీకరణ మార్పునకు సంకేతం? వంటి అనుమానాలు భారత్ ను వెంటాడడుతున్నాయి.

అసిమ్ మునీర్ ఎవరు వికీపీడియా?
ఫీల్డ్ మార్షల్ సయ్యద్ అసిమ్ మునీర్ అహ్మద్ షా (జననం 1968) ఒక పాకిస్తానీ సైనిక అధికారి, ప్రస్తుతం 2022 నుండి పాకిస్తాన్ సైన్యం యొక్క 11వ ఆర్మీ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
పాకిస్తాన్‌లో ఆర్మీ చీఫ్ జీతం ఎంత?
మరోవైపు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నెలకు దాదాపు PKR 2,50,000 అంటే భారత రూపాయలలో ₹ 75,000 జీతం పొందుతారు. ఆయనకు కొన్ని ప్రభుత్వ సౌకర్యాలు కూడా లభిస్తాయి, కానీ వాటి సంఖ్య మరియు నాణ్యత భారతదేశం కంటే తక్కువగా పరిగణించబడతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/donald-trump-tariff-threats-against-india-trump-says-they-will-not-abate/international/527304/

Asim Munir China Influence Geopolitics India-Pakistan Tensions Latest News Breaking News Pakistan army South Asia politics Telugu News US Defense Diplomacy US-Pakistan Relations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.