📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgham Attack: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పహల్గామ్ దాడి వీడియో

Author Icon By Sharanya
Updated: April 26, 2025 • 4:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ దాడిలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం, వారి మతాన్ని అడిగి నిర్ధారించుకోవడం, హిందువులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరపడం వంటి వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన దేశమంతటా ఆగ్రహావేశానికి గురిచేసింది. పహల్గామ్, బైసరన్ వ్యాలీ వంటి పర్యాటక ప్రదేశాల్లో మానవత్వాన్ని మరిచి జరిగిన ఈ దాడి కశ్మీర్ లోయ భద్రతాపర పరిస్థితులపై మరోసారి ప్రశ్నలు వేస్తోంది.

వైరల్ యానిమేషన్ వీడియో

ఈ ఉగ్రదాడిని ఆಧారంగా చేసుకొని రూపొందించిన ఒక యానిమేషన్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అవుతోంది. నువ్వు హిందువా? అనే ముద్రిత క్యాప్షన్‌తో మహావీర్ జైన్ అనే నెటిజన్ ఈ వీడియోను ‘ఎక్స్’ వేదికపై షేర్ చేశారు. వీడియో మూడున్నర నిమిషాల నిడివి గలది. వైరల్ అవుతున్న ఈ యానిమేషన్ వీడియోలో చూపిన ప్రకారం, ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ వ్యాలీలో పర్యాటకులు గుర్రాలపై సవారీ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుండగా, ఒక్కసారిగా ఉగ్రవాదులు దాడికి పాల్పడడం ఈ వీడియోలో చూడొచ్చు. వీడియోలోని దృశ్యాల ప్రకారం, ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి, హిందువులని నిర్ధారించుకున్న తర్వాత కాల్చి చంపుతున్నట్లుగా చూపించారు. దాడి అనంతరం, భారత సైన్యం రంగంలోకి దిగి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, వారికి సహాయం అందించడం వంటి దృశ్యాలు కూడా ఈ యానిమేషన్‌లో ఉన్నాయి. ఆ తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ ఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించడం, మృతుల కుటుంబాలకు భరోసా ఇవ్వడం వంటి సన్నివేశాలను కూడా పొందుపరిచారు. భారత సైన్యానికి కృష్ణుడి రూపంలో దైవశక్తి ఆశీస్సులు లభించడం, ఆ తర్వాత సైన్యం ఉగ్రవాదులను మట్టుబెట్టడం వంటివి కూడా యానిమేషన్ రూపంలో చూపించారు. ‘న్యాయం కోసం ఎదురు చూస్తున్న భారత్’ అనే సందేశంతో ఈ వీడియో ముగుస్తుంది.

భద్రతా చర్యలు

ఈ దాడి తర్వాత కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అనుమానితులను గుర్తించేందుకు డ్రోన్‌లు, స్పెషల్ ఫోర్స్ యూనిట్లు పనిచేస్తున్నాయి. పహల్గామ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా తనిఖీలు తీవ్రమయ్యాయి. పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు అదనపు సైనిక బలగాలను మోహరించారు. ఈ దాడి వెనుక ఉన్న ఉగ్రవాద సంస్థలను గుర్తించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రత్యేక దర్యాప్తు చేపట్టింది.

https://twitter.com/Mahaveer_VJ/status/1915756622875422905?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1915756622875422905%7Ctwgr%5E9178b9bf118c023d5cbe152bd5992106e3ff5a56%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F827424%2Fviral-pahalgham-attack-animated-video-sparks-outrage

Read also: Pak Army : భారత్ జవాన్‌ను అదుపులోకి తీసుకున్న పాక్ ఆర్మీ

#JammuAndKashmir #Pahalgam #PahalgamAttack #PahalgamTerrorAttack #TerrorAttack #ViralVideo Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.