జమ్మూకాశ్మీర్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గామ్ (Pahalgam)కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఉగ్రదాడి తర్వాత పహల్గామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీ టూరిస్ట్‌లతో కళకళలాడుతోంది. రోడ్ల మీద పర్యాటకుల వాహనాలు బారులుతీరాయి. టూరిస్టులతో రద్దీగా ఉన్న పహల్గామ్ (Pahalgam) పరిసరాలను చూసి సీఎం ఒమర్ అబ్దుల్లా సంతోషం వ్యక్తం చేశారు. ఈ నెలలోనే ఆయన రెండోసారి పహల్గామ్‌లో పర్యటించారు. ఈ సందర్బంగా పర్యాటకులతో రద్దీగా ఉన్న అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు సీఎం ఒమర్ అబ్దుల్లా. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఉగ్రదాడి అనంతరం పహల్గామ్ పరిస్థితి
మిని స్విట్జర్లాండ్‌గా గుర్తింపు పొందిన పహల్గాం (Pahalgam)లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. జమ్మూకాశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు వచ్చిన పర్యాటకులపై దాడి చేసి 26 మందిని బలిగొన్నారు. ఈ
సంఘటన కశ్మీర్‌తో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దారుణ ఘటనతో కొన్ని రోజులపాటు అక్కడ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఆ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయడంతో మళ్లీ దేశీయులతో పాటు విదేశీ పర్యాటకులు సందడి చేస్తున్నారు.
ప్రస్తుతం ఆంక్షలు ఎత్తివేయడంతో పర్యాటకుల రాక
అక్కడ అందమైన ప్రదేశాల్లో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి వ్యాలీని చుట్టేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అక్కడి హోటళ్లు కూడా ప్రత్యేక డిస్కౌంట్లను అందజేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సీఎం ఒమర్ అబ్దుల్లా పర్యటన
ఓమర్ అబ్దుల్లా ఈ నెలలో రెండోసారి పహల్గామ్ (Pahalgam) కు పర్యటన. టూరిస్ట్‌ల రద్దీతో ఉన్న ప్రదేశాల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్. ప్రజల నుంచి సానుకూల స్పందన. “పహల్గామ్ తిరిగి నిలబడుతోంది” అనే సందేశంతో ఆత్మవిశ్వాసం.
Read Also: Iran: కాల్పుల విరమణపై ఎలాంటి ఒప్పందం జరగలేదు: ఇరాన్