📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడి..పాకిస్థాన్ మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 24, 2025 • 8:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Chaudhry Fawad Hussain : పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ తీవ్ర ఆవేదనలో ఉంది. కాశ్మీర్ అందాలను చూసేందుకు వెళ్లిన పర్యాటకుల్ని లక్ష్యంగా చేసుకున్న టెర్రరిస్టులు, 28 మంది కిరాతకంగా చంపారు. ఈ దాడి వెనక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు చెందిన ‘‘టీఆర్ఎఫ్’’ ఉన్నట్లు తేలింది. మరోవైపు, పాకిస్తాన్ తమకు ఈ దాడితో సంబంధం లేదని చెబుతూనే, సరిహద్దుల్లో తన బలగాలను మోహరించింది. భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో ఉంది.

దేశం కోసం ఒక్కటిగా నిలబడుతాం

ఇదిలా ఉంటే, పాకిస్తాన్ మాజీ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం “దాడి చేసినా లేదా బెదిరించినా” దేశం తనను తాను రక్షించుకోవడానికి కలిసి నిలబడుతుందని అన్నారు. తాము రాజకీయం విభజించబడి ఉన్నప్పటికీ, దేశం కోసం ఒక్కటిగా నిలబడుతామని అన్నారు. తమ మాతృభూమిని రక్షించుకోవడానికి పాకిస్తాన్ జెండా కింద కలిసి ఉంటామని ఎక్స్ వేదికగా ఫవాద్ పోస్ట్ చేశాడు. అయితే, ఈ పోస్టులో పహల్గామ్ దాడి గురించి ఎలాంటి సంతాపం కానీ, ఖండన కానీ, ప్రస్తావన కానీ చేయలేదు.

లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెద్దవద్దు

ఉగ్రదాడి తర్వాత భారతదేశంలో నిరంతర పరిణామాలను పర్యవేక్షిస్తున్న ఫవాద్.. మోడీ ప్రభుత్వం నుంచి సంయమనం ఆశిస్తున్నట్లు మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు. “భారత మంత్రివర్గం తన భద్రతా సమావేశాన్ని ముగించింది. యుద్ధానికి ఆజ్యం పోసేలా మీడియా కథనాలకు లొంగి లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెద్దవద్దని ఆశిద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు.

పుల్వామా తర్వాత జరిగిన అత్యంత దారుణమైన దాడి

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి, 2019లో పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అత్యంత దారుణమైన దాడిలో ఇది ఒకటి. మంగళవారం మధ్యాహ్నం అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ పట్టణానికి సమీపంలోని ఒక గడ్డి మైదానం సమీపంలో జరిగింది. లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. దాడి వెనుక ఉన్న ముగ్గురు అనుమానితుల స్కెచ్‌లను భారత భద్రతా సంస్థలు విడుదల చేశాయి. వీరిని పాకిస్తాన్ జాతీయులైన ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా మరియు అబు తల్హాగా గుర్తించారు.

Read Also: ఉగ్రదాడి.. ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్‌లు విడుదల

Breaking News in Telugu chaudhry fawad hussain Google news Google News in Telugu Latest News in Telugu Modi government Paper Telugu News Surgical Strikes Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.