हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Pahalgam Terror Attack : పహల్గాం దాడి.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

sumalatha chinthakayala
Pahalgam Terror Attack : పహల్గాం దాడి.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత

Pahalgam Terror Attack : జమ్ముకశ్మీర్‌ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈక్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఐదుగురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశాయి.

పహల్గాం దాడి ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు

. షోపియాన్‌లోని చోటిపొరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్‌ షాహిద్‌ అహ్మద్‌ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశాయి. ఇతడు గత మూడు, నాలుగు సంవత్సరాలుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు.

. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో యాక్టివ్‌ టెర్రరిస్ట్‌ జాహిద్‌ అహ్మద్‌ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్‌ అహ్మద్‌ షేక్‌ నివాసాన్ని పేల్చేశారు. 2023 జూన్‌ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు.

. కుల్గాంలోని ముర్రాన్‌ ప్రాంతంలో ఉగ్రవాది అహ్‌సన్ ఉల్‌ హక్‌ ఇంటిని బాంబులతో కూల్చారు. అహ్‌సన్‌ 2018లో పాకిస్థాన్‌ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత కశ్మీర్‌ లోయలోకి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి.

. ఇక, పుల్వామాలోని కాచిపొరా ప్రాంతంలో హరీస్‌ అహ్మద్‌ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు. ఇతడు కూడా 2023 నుంచి లష్కరే తరఫున యాక్టివ్‌గా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిపైనా ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం.

ఆపరేషన్ కొనసాగుతోంది..

ఇక, పహల్గాం దాడికి పాల్పడిన ముష్కరుల్లో ఒకడైన ఆదిల్‌ హుస్సేన్‌ థోకర్‌, మరో ఉగ్రవాది ఆసిఫ్‌ షేక్‌ ఇళ్లు నేలమట్టమైన విషయం తెలిసిందే. వేర్వేరు పేలుడు ఘటనల్లో ఇవి ధ్వంసమైనట్లు అధికారులు తెలిపారు. వారి ఇళ్లల్లో అప్పటికే బాంబులు అమర్చి ఉన్నాయని, భద్రతా బలగాలను ట్రాప్‌ చేయడం కోసమే వాటిని యాక్టివేట్‌ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు అనుచరులను భద్రతా దళాలు శనివారం అరెస్టు చేశాయి. ఖైమోహ్‌ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపాయి. అయితే, వారి పేర్లు, ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు.

Read Also: హెచ్‌-1బీ వీసా మోసం కేసు..భారత సంతతి వ్యక్తికి 14 నెలల జైలు శిక్ష

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

40వ టెస్ట్ సెంచరీతో హేడెన్‌కు ఊరట ఇచ్చిన జో రూట్…

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

గార్డులు, టెక్నాలజీ, గోప్య ప్రణాళికలు—పుతిన్ భద్రతా రహస్యాలు

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

బంగ్లాదేశ్‌కు పంపించబడిన గర్భిణి మహిళ…

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

ఇంధన భద్రత కోసం భారత్-రష్యా డీల్

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

భారత్​కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

పుతిన్ విలాసవంతమైన జీవన విధానం

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

25 సంవత్సరాలుగా రారాజుగా పాలిస్తున్న పుతిన్

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

18,822 మంది భారతీయుల బహిష్కరణ: అమెరికా

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

H-1B వీసాదారుల ప్రైవసీ కాస్తా పబ్లిక్.. లింక్డ్ ఇన్ కు ఆదేశాలు

📢 For Advertisement Booking: 98481 12870