📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu news : Ozone Layer – ఓజోన్ పొరపై గుడ్ న్యూస్ చెప్పిన ఐక్య‌రాజ్య‌స‌మితి

Author Icon By Sudha
Updated: September 16, 2025 • 3:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఐక్య‌రాజ్య‌స‌మితి శుభ‌వార్త చెప్పింది. భూమికి ర‌క్ష‌ణ క‌వ‌చంగా ఉన్న ఓజోన్ పొర కోలుకుంటున్న‌ట్లు(Ozone Layer) వెల్ల‌డించింది. రానున్న ద‌శాబ్ధాల్లో ఆ ఓజోన్ రంధ్రం పూర్తిగా మూసుకుపోనున్న‌ట్లు యూఎన్ త‌న నివేదిక‌లో పేర్కొన్న‌ది. అంత‌ర్జాతీయ దేశాల నిరంత‌ర చ‌ర్య‌ల వ‌ల్ల ఈ సక్సెస్ సాధ్య‌మైన‌ట్లు యూఎన్ తెలిపింది. యూఎన్ వ‌ర‌ల్డ్ మెటియోరోలాజిక‌ల్ ఆర్గ‌నైజేష‌న్ దీనిపై కొత్త నివేదిక‌ను రిలీజ్ చేసింది. అంటార్కిటికాపై ఉన్న ఓజోన్ రంధ్రం గ‌తంతో పోలిస్తే 2024లో చిన్న‌గా ఉన్న‌ట్లు ఆ నివేదిక‌లో పేర్కొన్నారు. ఐక్య‌రాజ్య‌స‌మితి చీఫ్ ఆంటోనియో గుటెర్ర‌స్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఓజోన్ పొర (recover) కోలుకుంటోంద‌న్నారు. శాస్త్ర‌వేత్త‌లు ఇచ్చిన హెచ్చ‌రిక‌లు ప‌నిచేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దీని వ‌ల్ల ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతోంద‌న్నారు. ఓజోన్ బులెటిన్ 2024ను ప్ర‌పంచ వాతావ‌ర‌ణ సంస్థ ప‌బ్లిష్ చేసింది. స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌రిణామాల వ‌ల్ల ఓజోన్ పొర (Ozone Layer) స‌న్న‌గిల్ల‌డం నిలిచిపోయిన‌ట్లు పేర్కొన్న‌ది. కానీ దీర్ఘ‌కాలంగా ఆలోచిస్తే, అది శాస్త్ర‌వేత్త‌ల ఘ‌న‌త‌గా తెలిపారు. క్లోరోఫ్లోరో కార్బ‌న్స్ వినియోగంపై అంత‌ర్జాతీయంగా వ‌త్తిడి తేవ‌డం వ‌ల్లే ఓజోన్ పొర (Ozone Layer) బ‌ల‌హీన‌ప‌డ‌డం ఆగిన‌ట్లు చెప్పారు.

Ozone Layer – ఓజోన్ పొరపై గుడ్ న్యూస్ చెప్పిన ఐక్య‌రాజ్య‌స‌మితి

వ‌ర‌ల్డ్ ఓజోన్ డే సంద‌ర్భంగా బులెటిన్ రిలీజ్ చేశారు. వియ‌న్న క‌న్వెన్ష‌న్ 40వ వార్షికోత్స‌వాన్ని కూడా జ‌రుపుకుంటున్నారు. ఆ నాటి స‌ద‌స్సులో ప్ర‌పంచ దేశాలు ఓజోన్ పొర స‌న్న‌గిల్ల‌డం ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. 1975లో ఆ క‌న్వెన్ష‌న్ జ‌రిగింది. ఆ త‌ర్వాత 1987లో మాంట్రియ‌ల్ ప్రోటోకాల్ రిలీజ్ చేశారు. రిఫ్రిజిరేట‌ర్లు, ఎయిర్ కండీష‌న‌ర్లు, ఏరోసోల్ స్ప్రేస్‌లో ఓజోన్ పొర‌ను బ‌ల‌హీన‌ప‌రిచే ప‌దార్ధాల వినియోగాన్ని త‌గ్గించాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతం ఓజోన్ పొర రిక‌వ‌రీ ట్రాక్‌లో ఉంద‌న్నారు. ఈ శ‌తాబ్ధం మ‌ధ్య కాలం వ‌ర‌కు .. 1980 త‌ర‌హా స్థాయికి ఓజోన్ పొర చేరుకుంటుంద‌ని అంచ‌నా వేశారు. దీని వ‌ల్ల స్కిన్ క్యాన్స‌ర్లు, క్యాట‌రాక్టులు త‌గ్గుతాయ‌న్నారు. అతినీల‌లోహిత కిర‌ణాల వ‌ల్ల జ‌రిగే న‌ష్టాలు నివారించ‌బ‌డుతాయని రిపోర్టులో తెలిపారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 29న‌ అంటార్కిటికా వ‌ద్ద ఓజోన్ పొర 46.1 మిలియ‌న్ ట‌న్నుల మాస్ డెఫిసిట్‌తో ఉంద‌ని, ఇది 1990-2020 ద‌శ‌కంతో పోలిస్తే త‌క్కువ అని రిపోర్టులో పేర్కొన్నారు.

ఓజోన్ పొర అంటే ఏమిటి?

ఓజోన్ పొర అనేది భూమి యొక్క స్ట్రాటో ఆవరణలో ఒక ప్రాంతం, ఇక్కడ ఓజోన్ వాయువు (O₃) అధిక సాంద్రతలు ఉంటాయి, సూర్యుని హానికరమైన అతినీలలోహిత వికిరణానికి వ్యతిరేకంగా రక్షణ కవచంగా పనిచేస్తాయి. భూమి ఉపరితలం నుండి దాదాపు 10 నుండి 50 కిలోమీటర్లు (6 నుండి 31 మైళ్ళు) దూరంలో ఉన్న ఇది సూర్యుని హానికరమైన UV-B కిరణాలను ఎక్కువగా గ్రహిస్తుంది, అవి ఉపరితలం చేరకుండా నిరోధిస్తుంది మరియు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు మరియు పర్యావరణ హానిని కలిగిస్తుంది.

ఓజోన్ వాసన ఏమిటి?

ఓజోన్ వాసన అనేది క్లోరిన్ బ్లీచ్ లేదా లోహ, శుభ్రమైన సువాసనను పోలి ఉండే ఒక పదునైన, ఘాటైన వాసన. ఇది మెరుపు దాడి లేదా ఉరుములతో కూడిన వర్షం తర్వాత తరచుగా కనిపించే వాసనగా గుర్తించబడుతుంది. స్టాటిక్ విద్యుత్ స్పార్క్ లేదా కాపీ యంత్రాలు వంటి కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలతో విద్యుత్ ఉత్సర్గాలు ఉన్న ఇతర పరిస్థితులలో కూడా ఈ వాసనను గుర్తించవచ్చు.

ఓజోన్ ఎలా ఏర్పడుతుంది?

సౌర అతినీలలోహిత (UV) వికిరణం ఆక్సిజన్ అణువులను (O₂) వ్యక్తిగత ఆక్సిజన్ అణువులుగా (O) విభజించినప్పుడు ఓజోన్ సహజంగా స్ట్రాటో ఆవరణలో ఏర్పడుతుంది. ఈ అత్యంత రియాక్టివ్ ఆక్సిజన్ అణువులు ఇతర ఆక్సిజన్ అణువులతో (O₂) కలిసి ఓజోన్ (O₃) ను సృష్టిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/chinas-bumper-offer-for-russian-citizens-visa-free-policy/international/548024/

BreakingNews Climate Change environment latest news Ozone Layer Telugu News UN Report united nations

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.