Asaduddin Owaisi : ఇరాన్ దాడులపై భారత్ స్పందించాలి, ఒవైసీ డిమాండ్

Read Time:  1 min
Asaduddin Owaisi
Asaduddin Owaisi
FONT SIZE
GET APP

Asaduddin Owaisi : ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలపై ఎంఐఎం చీఫ్ Asaduddin Owaisi స్పందిస్తూ, ఇరాన్‌పై జరుగుతున్న దాడులను భారత్‌ ఖండించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇరాన్ సుప్రీం లీడర్ Ali Khamenei హత్య చట్ట విరుద్ధమని పేర్కొంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన షియా సమాజానికి ముఖ్య నాయకుడని వ్యాఖ్యానించారు.

ఈ దాడులు కొనసాగితే గల్ఫ్ ప్రాంతంలో అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని ఓవైసీ హెచ్చరించారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో శాంతి ప్రయత్నాలకు ముందుకు రావాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని, యుద్ధ పరిస్థితులు కొనసాగితే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Iran-Israel War : ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లుతున్న ఇరాన్

Asaduddin Owaisi
Asaduddin Owaisi

ఇదిలా ఉండగా, ఖమేనీ మరణంపై హైదరాబాద్ పాతబస్తీలో నిరసనలు చోటుచేసుకున్నాయి. పురాని హవేలీ ప్రాంతంలో ఒక సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించగా, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కారణంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఖమేనీ మరణం నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్నాయి.

అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ పరిణామం మధ్యప్రాచ్య రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.