📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

London: లండన్​లో మేయర్​గా మన ‘రైతు బిడ్డ’

Author Icon By Shobha Rani
Updated: May 15, 2025 • 3:50 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్​ప్రదేశ్​లోని రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి లండన్​(London)లో ఓ నగరానికి మేయర్​గా ఎన్నికయ్యారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఆయనకు అధికార హోదా దక్కడం పట్ల కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు. మేయర్​గా ప్రమాణ స్వీకారం చేసిన వీడియో చూసి హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే, మీర్జాపుర్ జిల్లా​లోని బటేవ్రా గ్రామానికి చెందిన మున్నాలాల్​ మిశ్రా కుమారుడు రాజ్​కుమార్​ మిశ్రా (Raj kumar mistra)చండీగఢ్​లో బీటెక్​ పూర్తి చేశారు. ఐదు సంవత్సరాల క్రితం ఎంటెక్​ చదవడానికి లండన్​ వెళ్లారు. కంప్యూటర్​ సైన్స్​లో ఎంటెక్​ పూర్తి చేసిన తర్వాత అక్కడే ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ప్రతాప్​గఢ్​కు చెందిన అభిషేక్తా​ మిశ్రాను వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఇంజనీర్​గా వర్క్ చేస్తున్నారు. దీంతో కుటుంబంతో రాజ్​కుమార్​ (Raj kumar mistra) లండన్​లో స్థిరపడ్డారు. చాలా సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటుండడం వల్ల ఆయనకు లండన్ పౌరసత్వం లభించింది. దీంతో రెండు నెలల క్రితం లేబర్​ పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేసి కౌన్సిలర్​గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత బేలిగ్​బౌరి నగర మేయర్​గా గెలిచారు.

London: లండన్​లో మేయర్​గా మన ‘రైతు బిడ్డ’

కుటుంబ హర్షం
తమ కుమారుడు మేయర్​గా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందని మున్నాలాల్​ తెలిపారు. రోజూ తమతో మామూలుగా మాట్లాడుతాడని, కానీ నేడు ఓ మేయర్​గా​ ఎన్నికై తమతో సంభాషించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పారు. తమ కుటుంబమంతా హ్యాపీగా ఉందన్నారు. రాజ్​కుమార్​కు ఆయన సోదరులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇంజనీర్ భార్యతో కలిసి స్థిర నివాసం

రాజ్​కుమార్​ మిశ్రా (Raj kumar mistra)తండ్రి మున్నాలాల్​ మిశ్రా ఒక రైతు. తల్లి చంద్రకళి మిశ్రా గృహిణి. మున్నాలాల్​కు పది మంది సంతానం. అందులో రాజ్​కుమార్ మిశ్రా ఆరో వ్యక్తి. రాజ్​కుమార్​ అన్నయ్యలు కిషోర్​ మిశ్రా, సునీల్​ కుమార్​ మిశ్రా న్యాయవాదులు. మిగతా సోదరులు రమేశ్ కుమార్ మిశ్రా పాఠశాల ప్రిన్సిపాల్‌గా, విపిన్ కుమార్ మిశ్రా వ్యవసాయంలో మాస్టర్ ట్రైనర్‌గా, శివ్‌జీ మిశ్రా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. రాజ్ కుమార్​ (Raj kumar mistra) తమ్ముడు పవన్ కుమార్ మిశ్రా ఒక రైతు కాగా, మరొకరు సర్వేష్ కుమార్ మిశ్రా ఒక వైద్యుడిగా సేవలందిస్తున్నారు. సోదరి అనితా కుమార్ మిశ్రాను వివాహం చేసుకుని ముంబయిలో స్థిరపడ్డారు.

Read Also: STALIN: సుప్రీం తీర్పును ప్రశ్నించిన ముర్ము – సీఎం స్టాలిన్ విమర్శలు

#telugu News as mayor in London Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Our 'farmer's child' Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.