📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Bin Laden: బురఖా ధరించి మా పక్క నుంచే వెళ్లిన లాడెన్: సీఐఏ మాజీ అధికారి

Author Icon By Vanipushpa
Updated: October 25, 2025 • 12:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికాను వణికించిన అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్(Bin Laden) గురించి సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకో ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా వెల్లడించారు. 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా టెర్రరిస్టులు విమానాలను హైజాక్ చేసి అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత అమెరికా బలగాలు అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కోసం వేట మొదలు పెట్టాయి. అమెరికా(America) బలగాలను ముఖ్యంగా సీఐఏను ముప్పుతిప్పలు పెట్టిన లాడెన్.. చివరకు 2011 మే 2న పాకిస్థాన్ లోని అబోట్టాబాద్ లో హతమయ్యాడు.

Read Also: Central Govt: ఓలా, ఉబర్‌లకు పోటీగా ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నకేంద్ర ప్రభుత్వం

Bin Laden

2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ కూల్చివేత

ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన పదేళ్ల తర్వాత లాడెన్ ను అమెరికా బలగాలు తుదముట్టించాయి. అయితే, లాడెన్ అంతకుముందే తమకు పట్టుబడేవాడని, త్రుటిలో తప్పించుకున్నాడని జాన్ కిరియాకో చెప్పారు. 2001 సెప్టెంబర్ 11న ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాతి నెలలో.. అంటే అక్టోబర్ లోనే ఆఫ్ఘనిస్థాన్ లోని టోరాబోరా కొండల్లో అల్ ఖైదా స్థావరాన్ని సీఐఏ బలగాలు చుట్టుముట్టాయని వివరించారు. ఆ సమయంలో బిన్ లాడెన్ కూడా అక్కడే ఉన్నాడని చెప్పారు. లాడెన్ కదలికలపై పక్కాగా నిఘా పెట్టి టోరాబోరా కొండల్లో అతడిని పట్టుకోవడమో లేక హతమార్చడమో చేసేందుకు ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్లామని వివరించారు.

మహిళలతో పాటు బిన్ లాడెన్ బురఖాతో తప్పించుకున్నాడు

అల్ ఖైదా కూడా తమకు కౌంటర్ గా కుయుక్తులు పన్నిందని, అందులో మొదటగా తమ సానుభూతిపరుడిని మా వద్దకు పంపించిందని జాన్ కిరియాకో చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ లో లాడెన్ కోసం వేటాడుతున్న క్రమంలో తమకు స్థానిక భాషలు తెలిసిన అనువాదకుడి అవసరం ఏర్పడిందన్నారు. టోరాబోరా కొండలను చుట్టుముట్టిన తర్వాత టెర్రరిస్టుల నుంచి తమకు ఓ ప్రతిపాదన వచ్చిందన్నారు. తమ వద్దనున్న మహిళలు, పిల్లలను క్షేమంగా బయటకు పంపించాక తాము లొంగిపోతామని టెర్రరిస్టులు చెప్పారని, ఇందుకోసం సాయంత్రం దాకా వేచి ఉండాలని ప్రతిపాదించారని వివరించారు. తమకు అనువాదకుడిగా పనిచేసిన వ్యక్తి ఈ ప్రతిపాదనకు అధికారులను ఒప్పించాడన్నారు. తీరా సాయంత్రం మసక చీకట్లలో మహిళలతో పాటు బిన్ లాడెన్ కూడా ఓ బురఖా ధరించి తమ పక్క నుంచే వెళ్లిపోయాడని జాన్ కిరియాకో వివరించారు. నాడు అల్ ఖైదా టెర్రరిస్టుల ప్రతిపాదనకు ఒప్పుకోకుంటే లాడెన్ ను 2001లోనే తుదముట్టించే వాళ్లమని కిరియాకో తెలిపారు.

బిన్ లాడెన్ పిల్లలకు ఏమైంది?
ఒసామా బిన్ లాడెన్ పిల్లలు

అబ్దుల్ రెహమాన్ బిన్ లాడెన్ (జననం 1978) సాద్ బిన్ లాడెన్ (1979–2009), 2009లో పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో మరణించాడు. ఒమర్ బిన్ లాడెన్ (జననం 1981), జైనా అల్సబా-బిన్ లాడెన్‌ను 2006 నుండి ఇప్పటి వరకు వివాహం చేసుకున్నాడు.
ఒమర్ బిన్ లాడెన్
ఒసామా బిన్ లాడెన్ యొక్క నాల్గవ పెద్ద కుమారుడు ఒమర్ బిన్ లాడెన్ ఒక కళాకారుడు మరియు రచయిత, మరియు అతని కళ అతను నివసించే ఫ్రాన్స్‌లో ప్రదర్శించబడుతుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Al Qaeda CIA Ex CIA Officer Intelligence Latest News Breaking News News Osama Bin Laden Paragraph Telugu News Terrorism

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.