భారత్-పాకిస్థాన్ లమధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సందర్భంగా పాకిస్తాన్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్ సైనిక బలగాల దాడుల భయంతో పాకిస్తాన్,నౌకాదళం తమ ప్రధాన స్థావరాల్ని వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత క్షిపణుల నుంచి తమ యుద్ధ నౌకలను కాపాడుకునేందుకు పాక్ నేవీ వాటిని కరాచీ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ కీలక విషయం తాజాగా బయటపడిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఖాళీగా కనిపించిన కరాచీ నౌకాశ్రయం
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక సేకరించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం, మే 8వ తేదీన కరాచీ నౌకాశ్రయం దాదాపు ఖాళీగా కనిపించింది. అయితే, రెండు రోజుల తర్వాత మే 10వ తేదీన,కరాచీకి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్వాదర్ పోర్టు (Gwadar Port) లో ఏకంగా ఏడు పాక్ యుద్ధ నౌకలు నిలిపి ఉంచినట్లు స్పష్టంగా నమోదైంది. మరికొన్ని నౌకలను వాణిజ్య టెర్మినళ్లలో,ఇరాన్ సరిహద్దులకు సమీపంలోని జిల్లాల్లో దాచిపెట్టినట్లు సమాచారం.

చైనా నుంచి కొనుగోలు చేసిన జుల్ఫికర్ ఫ్రిగేట్లు
పాకిస్తాన్ తరలించిన నౌకల్లో పాకిస్తాన్ ఆరునెలల క్రితమే చైనా నుంచి కొనుగోలు చేసిన నాలుగు శక్తిమంతమైన ‘జుల్ఫికర్’ శ్రేణి ఫ్రిగేట్లు కూడా ఉన్నాయి. ఈ నౌకలను పారంభించినప్పుడు పాక్ నేవీ యాంటీ-షిప్ మిసైల్స్ ప్రయోగించిన వీడియోలను విడుదల చేసి గొప్పగా ప్రచారం చేసుకుంది పాక్. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం భారత దాడి భయంతో వాటిని ప్రధాన స్థావరం నుంచి తరలించడం గమనార్హం.
పహల్గాం దాడితో యుద్ధం-తోక ముడిచిన పాక్
జమ్మూకాశ్మీర్లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు దాడి చేసి, టూరిస్టులను టార్గెట్ చేసుకుని 26మంది పురుషులను హతమార్చారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భారత్, పాకిస్తాన్ కు వెళ్లే సింధునది జలాలను ఆపివేసింది. అంతేకాదు భారతదేశంలో ఉన్న పాకిస్థాన్ ప్రజలను వారం రోజులు గడువు ఇచ్చి, దేశం విడిచిపోవాలని హుకుం జారీ చేసింది.అనంతం ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్ పై మిసైల్స్ దాడికి పూనుకుంది. పాకిస్తాన్ కూడా భారత్ పై దాడులకు పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ పై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది. ‘దేశ రక్షణ కోసం వీర మరణం పొందడానికైనా సిద్ధం’ అని ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు విమర్శిస్తున్నారు. మే10న నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భారత్ దాడి చేసినప్పుడు మునీర్ ఓ రహస్య బంకర్లో దాక్కున్నారని ఆరోపిస్తూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాక ఇటీవల మునీర్అమెరికాలో పర్యటించినప్పుడు గుజరాత్ లోని రిలయన్స్ ఆయిల్స్ పై దాడి చేస్తామని హెచ్చరించారు. బిలావల్ భుట్టో సింధు నీరు వదలకపోతే మళ్లీ యుద్ధానికి సిద్ధమని పేర్కొ
న్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: