📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Rahul R Singh: ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. ‘ఆపరేషన్ సిందూర్’ రహస్యాల వెల్లడి!

Author Icon By Shobha Rani
Updated: July 5, 2025 • 1:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

‘ఆపరేషన్ సిందూర్’ సైనిక ఘర్షణలో భారత్ ఒకరిని కాదు, ఏకంగా ముగ్గురు శత్రువులను ఎదుర్కొందని ఆర్మీ ఉన్నతాధికారి (Rahul R Singh)ఒకరు సంచలన విషయాలు వెల్లడించారు. నాలుగు రోజుల పోరాటంలో పాకిస్థాన్‌కు చైనా, టర్కీ దేశాలు కీలక సైనిక సహకారం అందించాయని ఆయన స్పష్టం చేశారు.
లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ మాట్లాడుతూ..
నిన్న ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆర్మీ డిప్యూటీ చీఫ్ (సామర్థ్య అభివృద్ధి) లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ (Rahul R Singh)మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆపరేషన్‌లో పాకిస్థాన్ ముందు కనిపించినా, తెరవెనుక చైనా, టర్కీలు కీలక పాత్ర పోషించాయి. ‘అరువు కత్తితో హత్య’ అనే తన పాత వ్యూహాన్ని చైనా ప్రయోగించింది. పాకిస్థాన్‌ను అడ్డుపెట్టుకుని తన లక్ష్యాలను నెరవేర్చుకోవాలని చూసింది” అని ఆయన వివరించారు.
చైనా, పాక్ యుద్ధ వ్యూహం
ఈ ఘర్షణను చైనా తమ ఆయుధ వ్యవస్థల పనితీరును పరీక్షించుకోవడానికి ఒక ‘లైవ్ ల్యాబ్’ (‘Live Lab’)గా పరిగణించిందని జనరల్ సింగ్ తెలిపారు. అంతేకాకుండా, యుద్ధ సమయంలో భారత ఆయుధాల మోహరింపుపై చైనా ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌కు రియల్ టైమ్ సమాచారం అందించిందని (Rahul R Singh)ఆయన వెల్లడించారు.

ఒకే యుద్ధంలో ముగ్గురు శత్రువులు.. ‘ఆపరేషన్ సిందూర్’ రహస్యాల వెల్లడి!

కాల్పుల విరమణ చర్చల సమయంలో “మీ ఫలానా ఆయుధం సిద్ధంగా ఉందని మాకు తెలుసు, దాన్ని వెనక్కి తీసుకోండి” అని పాక్ అధికారులు చెప్పినట్టు ఆయన గుర్తుచేశారు. టర్కీ కూడా యుద్ధ సమయంలో తన బేరక్తార్ డ్రోన్లు, శిక్షణ పొందిన సిబ్బందిని పాక్‌కు పంపించిందని తెలిపారు.
టర్కీ బేరక్తార్ డ్రోన్లు – నూతన ముప్పు
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన ఘటనకు ప్రతీకారంగా మే 7 నుంచి 10 వరకు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (‘Operation Sindoor’)చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాద, సైనిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. అయితే, భారత్ మరింత పెద్ద దాడికి సిద్ధపడటంతోనే పాకిస్థాన్ కాల్పుల విరమణకు అంగీకరించిందని జనరల్ సింగ్ పరోక్షంగా సూచించారు. “దాగి ఉన్న ఆ ఆయుధం ప్రయోగిస్తే పాకిస్థాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని వారు గ్రహించారు” అని ఆయన అన్నారు.
జనరల్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన
ఈ నేపథ్యంలో, జనరల్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. చైనా వ్యవహారంపై పార్లమెంటులో వెంటనే చర్చ జరపాలని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు.
గోప్యమైన ఆయుధం – భారత్ నిశ్శబ్ద హోమం
భారత్ ఇంకా విడుదల చేయని కీలక ఆయుధం సిద్ధంగా ఉంది. అదే ఉపయోగించినట్లయితే, పాక్ దెబ్బతినేది తీవ్రంగా అని సైన్యం అభిప్రాయం.అదే మౌన బెదిరింపుతో పాక్ వెనక్కి తగ్గిన సంభావ్యత – జనరల్ వ్యాఖ్యల్లో స్పష్టమైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Rahul: ట్రంప్‌కు మోదీ అడుగులకు మడుగులొత్తుతారు: రాహుల్ గాంధీ

Bayraktar drones Pakistan Breaking News in Telugu China intelligence in war China role in Indo-Pak conflict Congress reaction China issue Google news India retaliates for Pahalgam attack India vs Pakistan 2025 conflict Indian army secret weapons Latest News in Telugu Operation Sindoor India Pakistan ceasefire 2025 Paper Telugu News Rahul R Singh army statement Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Turkey drones in Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.