📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన

Operation Sindoor: కీలక ఉగ్రనేతల హతం..

Author Icon By Shobha Rani
Updated: May 10, 2025 • 3:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్‌కు గొప్ప విజయం లభించింది. ఆపరేషన్‌ సింధూర్‌(Operation Sindoor)లో కీలక ఉగ్రవాద నేతలు హతం అయ్యారు. ఉగ్రవాదులను అంతం చేయడానికే ఈ దాడులు చేశామన్న భారత్‌.. తిరుగులేని ఆధారాలను వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం.. భారత్ మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌ ను ప్రారంభించింది.. ఈ ఆపరేషన్‌లో కీలకమైన 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగాయి. పాకిస్తాన్, పీఓకే భూభాగంలోని కీలకమైన మురిడ్కే, బహవల్పూర్, సియాల్కోట్, చకంబ్రూ, కోట్లీ, గుల్పూర్, భీంబర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అయితే.. ఈ దాడుల్లో టాప్‌ టెర్రరిస్టులు హతమయ్యారు.

అత్యంత ప్రమాదకర ఉగ్రవాదులు హతం
కరుడుగట్టిన ఐదుగురు ఉగ్రవాదులు మరణించినట్టు శనివారం ఇండియన్‌ ఆర్మీ ప్రకటించింది. మరణించినవారిలో ముగ్గురు జైషే మహ్మద్‌.. ఇద్దరు లష్కరే టెర్రరిస్టులుగా ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాదు, చనిపోయినవారిలో జైషే చీఫ్‌‌ మసూద్‌ అజర్‌ బంధువులు కూడా ఉన్నారు. హతమైన ఉగ్రవాదుల్లో ముంబై 26/11 దాడుల నిందితుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది
మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌లో హతమైన టెర్రరిస్టుల పేర్లు ఇవే..

Operation Sindoor: కీలక ఉగ్రనేతల హతం..
  1. ముదస్సర్‌ ఖాదియాన్‌ ఖాస్‌ అలియాస్‌ అబూ జుందాల్.. ఇతను లష్కరే తోయ్యిబా టెర్రరిస్ట్‌
  2. హఫీజ్‌ మొహ్మద్‌ జమాల్.. ఇతను జైషే మహ్మద్‌ ఉగ్ర గ్రూప్‌.. మసూద్‌ అజర్‌కి ఇతను పెద్ద బావమరిది
  3. మహ్మద్‌ యూసుఫ్‌ అజార్‌ అలియాస్‌ ఉస్తాద్‌జీ అలియాస్‌ ఘౌసిసాబ్‌.. ఇతనిది కూడా జైషే గ్రూపే.. అంతేకాదు మసూద్‌ అజర్‌కి మరో బావమరిది ఇతను..
  4. ఖలీద్‌ అలియాస్‌ అబూ అఖాస.. ఇతను లష్కరే ఉగ్రవాది.. జమ్మూకశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో నిందితుడు..
  5. మహ్మద్‌ హసన్‌ఖాన్‌.. జైషే మహ్మద్‌ ఉగ్రసంస్థ ఉగ్రవాది.. పీవోకేలో జైషే గ్రూప్‌కి కమాండర్‌గా ఉన్నాడు.
  6. వీళ్లంతా మే 7న జరిగిన ఆపరేషన్‌ సింధూర్‌లో హతమయ్యారని ప్రకటించింది. వీరితో పాటు పలువురు ఉగ్రవాదలు హతమైనట్లు వెల్లడించింది. పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోంది: విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
  7. ఆధారాలతో భారత ప్రతిస్పందన
  8. భారత్‌పై తాము అనేక దాడులు చేశామంటూ పాక్ పెద్ద ఎత్తున అవాస్తవాలు ప్రచారం చేస్తోందన్నారు విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. సిర్సాలో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్, అదంపూర్‌లో ఎస్‌-400 బేస్, విద్యుత్, సైబర్, మౌలిక వ్యవస్థలను తాము ధ్వంసం చేశామని పాక్ అవాస్తవాలను ప్రచారం చేస్తోందన్నారు. భారత్‌ మిస్సైల్స్‌ ఆఫ్గానిస్తాన్‌ టార్గెట్ చేశాయనే ప్రచారంలోనూ ఎలాంటి నిజం లేదని వివరించారు.పాక్ మీడియా, ప్రభుత్వ వర్గాలు భారత్‌పై తమ దాడుల విజయాన్నిచూపించడానికి ప్రయత్నించాయి. పాక్ తెలిపిన దాడులన్నీ అసత్యమని, వాస్తవ ఆధారాలు లేవని విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు.

Read Also: Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !

Breaking News in Telugu Google news Google News in Telugu Killing of key terrorist leaders.. Latest News in Telugu Operation Sindoor: Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.