📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

India Pakistan War: నరమేధానికి ప్రతీకారమే.. ఆపరేషన్ సింధూర్ మిషన్

Author Icon By Sudha
Updated: May 7, 2025 • 12:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం.

India Pakistan War: నరమేధానికి ప్రతీకారమే.. ఆపరేషన్ సింధూర్ మిషన్

ధ్వంసమైన ఉగ్రవాద శిక్షణా శిబిరాలు
తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది. బహవాల్‌పూర్‌ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు ధ్వంసం అయ్యాయి.
పాకిస్తాన్ దురాగతాలకు తెర తీసిన కేంద్రం
ఈ పరిణామాలతో భారత్- పాకిస్తాన్ సరిహద్దు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీకరంగా తయారయ్యాయి. రెండు దేశాలు కూడా సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. యుద్ధ సామాగ్రిని చేరవేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించింది. బంకర్లల్లో తలదాచుకోవాలనీ సూచించింది. అదే సమయంలో పాకిస్తాన్ దురాగతాలకు తెర తీసింది. సరిహద్దు గ్రామాలపై మోర్టార్ షెల్స్‌తో దాడులకు దిగింది. జమ్మూ కాశ్మీర్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో అమాయకుల రక్తపాతానికి ప్రతీకారంగా, భారత వాయుసేన బుధవారం తెల్లవారుజామున ప్రారంభించిన ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణా శిబిరాలపై తీవ్ర వైమానిక దాడులు నిర్వహించింది.

భారత్ వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికే సాధారణ పౌరులపై ఇలా మోర్టార్ షెల్స్‌తో ప్రతీకారానికి పాల్పడింది పాక్. పూంచ్‌లోని కృష్ణ ఘాటి, షాపూర్, మన్‌కోఠ్, జమ్మూ సెక్టార్‌ రాజౌరి జిల్లాలోని లామ్, మన్జా కోఠ్, కాశ్మీర్‌ సెక్టార్‌ కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తంగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. ఫిరంగులతో కాల్పులు జరిపారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని బద్దలుకొట్టేందుకు తీవ్రంగా కట్టుబడి ఉన్నట్లు ఆపరేషన్ సింధూర్ స్పష్టంగా చూపించింది. పాక్ వైఖరిని అంతర్జాతీయ వేదికలపై ఎత్తిచూపే దిశగా కేంద్రం దూకుడుగా ఉంది.

Read Also : Pakistan: కూసాలు కదిలాయ్.. పక్కా ప్రూఫ్స్‌

Breaking News in Telugu for the massacre.. Google news Google News in Telugu Latest News in Telugu Mission is revenge Operation Sindhur Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.