📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు దుండగుల కాల్పుల్లో మరణించిన భారత విద్యార్థి కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు!

Operation Sindhur: భారత్-పాక్ ల మధ్య మళ్లీ యుద్ధం-అమెరికా రిపోర్ట్

Author Icon By Rajitha
Updated: December 30, 2025 • 4:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ ఏడాది మే మాసంలో భారత్-పాకిస్తాన్ లమధ్య ఆపరేషన్ సిందూర్ యుద్ధం (war) జరిగింది. ఈ యుద్ధంలో భారత్ దే పైచేయిగా నిలిచింది. నాలుగురోజులు యుద్ధం తర్వాత పాక్ అభ్యర్థన మేరకు రెండుదేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి. అయితే భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (సిఎఫ్ ఆర్) సాయుధ సంఘర్షణ అవకాశాలను సంభావ్యత ఉందని చెప్పింది. ఇది అమెరికన్ ప్రయోజనాలపై పరిమిత ప్రభావం చూపొచ్చని తెలిపింది. ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుదల కారణంగా భారత్, పాక్ మధ్య తిరిగి సాయుధ సంఘర్షణకు అవకాశం ఉన్నట్లు సీఎఫ్ ఆర్ ఆన్ కాన్స్టిక్ట్ వాచ్ ఇన్ 2026 నివేదికలో పేర్కొంది. భారత్ తో మాత్రమే కాకుండా, పాక్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య కూడా సాయుధ ఘర్షణ జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.

Read also: Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థినుల మృతి

Operation Sindhur

ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించి పాక్ వ్యాప్తంగా ఉన్న లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలు, వాటి కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తర్వాత పాక్ సైన్యం, భారత్ పై దాడులకు ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 11 ఎయిర్ బేసుల్ని భారత్ క్షిపణులు ఢీకొట్టి ధ్వంసం చేశాయి. దీని తర్వాత, తాజాగా థింక్ ట్యాంక్ నుంచి ఈ నివేదిక వచ్చింది.

చలి, మంచు కారణంగా భారత్లో వచ్చే అవకాశం

జమ్మూ కాశ్మీర్ లో చలి, మంచు తీవ్రత అధికంగా ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడే అవకాశం ఉంది. జమ్మూలో ఇప్పటికే 30మందికి పైగా పాకిస్తానీ ఉగ్రవాదులు పనిచేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీంతో, జమ్మూ కాశ్మీర్ లో భద్రతా బలగాలు కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెండుదేశాలు కూడా తమ రక్షణ పరికరాల కొనుగోలును వేగవంతం చేశాయి. డ్రోన్లు, ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులు, గైడెడ్ బాంబులను కొనుగోలు చేయడానికి భారతదేశ రక్షణ శాఖ ఇటీవల రూ.79,000కోట్ల విలువైన కొనుగోళ్లను ఆమోదించింది. అదేవిధంగా పాకిస్తాన్ ఆపరేషన్ సిందూర్ లో దెబ్బతిన్న తర్వాత చైనా, టర్కీల నుంచి కొత్త డ్రోన్లు, వైమానిక రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు చర్చలు ప్రారంభించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

india latest news Operation Sindhur Pakistan Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.