ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సంస్థ సీఈఓ పీట్ లౌ (Pete Lau) పై తైవాన్ ప్రాసిక్యూటర్లు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తైవాన్ చట్టాలను అతిక్రమించి, రహస్యంగా వ్యాపార కార్యకలాపాలు సాగించడమే కాకుండా అక్రమంగా ఉద్యోగులను నియమించుకున్నారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. తైవాన్, చైనా మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల గురించి మనందరికీ తెలిసిందే. తైవాన్‌లోని ‘క్రాస్-స్ట్రెయిట్ యాక్ట్’ (Cross-Strait Act) ప్రకారం.. ఏ చైనీస్ కంపెనీ అయినా తైవాన్‌లో వ్యాపారం చేయాలన్నా లేదా అక్కడి వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్నా ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. అయితే వన్ ప్లన్ సీఈఓ(OnePlus CEO) పీట్ లౌ ఈ చట్టాలను తుంగలో తొక్కినట్లు తైవాన్ అధికారులు గుర్తించారు. 2015లోనే హాంకాంగ్ కేంద్రంగా ఒక షెల్ కంపెనీని (నకిలీ సంస్థ) ఏర్పాటు చేసి, దాని ద్వారా తైవాన్‌లో రహస్యంగా ఒక బ్రాంచ్ ను తెరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Read Also: Republic Day 2026: అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
ప్రాసిక్యూటర్ల సమాచారం ప్రకారం
వన్‌ప్లస్ సంస్థ తైవాన్‌లో సుమారు 70 మంది కంటే ఎక్కువ మంది సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను రహస్యంగా నియమించుకుంది. వీరంతా వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన అప్లికేషన్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ పనుల్లో నిమగ్నమయ్యారు. తైవాన్ లోని అత్యున్నత టెక్నాలజీ ప్రతిభను (Tech Talent) దొంగచాటుగా వాడుకోవడమే ఈ సంస్థ లక్ష్యమని అధికారులు మండిపడుతున్నారు. డబ్బులు ఎలా వచ్చాయి? తైవాన్ లోని ఈ రహస్య కార్యకలాపాల కోసం వన్‌ప్లస్ సుమారు 2.3 బిలియన్ తైవాన్ డాలర్లను (సుమారు 73 మిలియన్ డాలర్లు) కేటాయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తాన్ని సాఫ్ట్‌వేర్ అమ్మకాల ఆదాయంగా చూపిస్తూ.. హాంకాంగ్ ద్వారా తైవాన్‌కు మళ్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో పీట్ లౌకు సహకరించిన ఇద్దరు తైవాన్ పౌరులపై కూడా ఇప్పటికే అభియోగాలు నమోదయ్యాయి. తైవాన్ ఎందుకు ఇంత సీరియస్‌గా ఉంది? సెమీ కండక్టర్లతో పాటు సాఫ్ట్ వేర్ రంగంలో తైవాన్ ప్రపంచానికే గుండెకాయ వంటిది. గత ఏడాది కాలంలోనే ఇలాంటి అక్రమ రిక్రూట్‌మెంట్లు చేస్తున్న 16 చైనీస్ కంపెనీలపై తైవాన్ దాడులు నిర్వహించింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: