📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Visa: రూ.1 కే వీసా..బంపర్‌ ఆఫర్‌

Author Icon By Vanipushpa
Updated: August 2, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మీరు విదేశాలకు ట్రిప్‌ వేయాలనుకుంటున్నారా ?. వీసా కోసం వేలు, లక్షలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రూ.1 చెల్లిస్తే చాలు మీకు వీసా వచ్చేస్తుంది. ఏంటీ షాక్ అవుతున్నారా ? నిజమేనండి. అట్లీస్ అనే సంస్థ తాజాగా ఈ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. రూ.1కే వీసా ఇస్తామని ప్రకటించింది. భారత(Indian) ప్రయాణికలకు ఆగస్టు 4,5 తేదీల్లో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. వీసా ప్రాసెసింగ్‌ ప్లాట్‌ఫాం అయిన అట్లీస్ 2021లో ప్రారంభమయ్యింది. మోహక్ నహ్తా అనే వ్యక్తి అమెరికా(America) లోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఈ కంపెనీని స్థాపించారు. అయితే ఈ కంపెనీ తాజాగా రూ.1కే వీసా ఆఫర్‌ను తీసుకొచ్చింది.

Visa: రూ.1 కే వీసా..బంపర్‌ ఆఫర్‌

రూ.1 వీసా ఆఫర్‌ను ప్రకటించిన దేశాలు
‘వన్‌ వే అవుట్’ పేరిట యూకే, వియత్నాం,ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్‌, హాంకాంగ్‌, ఖతర్‌, కెన్యా, తైవాన్‌, యూఏఈ, ఇండోనేసియా, జార్జియా, ఒమన్‌, మొరాకో లాంటి దేశాలకు వెళ్లాలనుకునేవారికి రూ.1 వీసా ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే అట్లీస్ సంస్థ ద్వారా వీసా బుక్ చేసుకుంటే ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ, గ్రీస్‌ లాంటి దేశాలకు ఎలాంటి సేవాల రుసుము, అపాయిట్‌మెంట్‌ ఫీజు అనేవి ఉండవు.

ఉదాహరణకు మీకు ఫ్రాన్స్‌కు వెళ్లాలి అనుకుంటే దీనికి అపాయింట్‌మెంట్ ఫీజు రూ.2,047 ఉంటుంది. సర్వీస్ ఫీజు రూ.2,905 ఉంటుంది. ఈ ఆఫర్‌ కింద మీరు కేవలం రూపాయి మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అలాగే అమెరికాకు వెళ్లాలనుకుంటే సర్వీస్ ఫీజు రూ.19,940 వరకు ఉంటుందని.. ఈ ఆఫర్ ఉన్నప్పుడు రూపాయి మాత్రమే చెల్లిస్తే చాలని అట్లీస్ ఫౌండర్ మోహక్ నహ్తా తెలిపారు. యూకేకు సైతం ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
అప్లికేషన్ సమర్పించాల్సి న తేదీలు
అట్లీస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రాసెసింగ్‌ కేంద్రం వద్ద కాన్సులేట్, బయోమెట్రిక్ ఫీజులు చెల్లించాలి. ఆగస్టు 4 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 5 రాత్రి 12 గంటల లోపు ఈ అప్లికేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కుటుంబ సభ్యులు కూడా ఉంటే వాళ్లకు సాధారణ ఛార్జీలు ఉంటాయి. ముందుగా మీరు ఏ దేశం వెళ్తున్నారో.. ఆయా దేశానికి సంబంధించి ఎంబసీ విధించిన రూల్స్‌ను గమనించుకోవాలి. లేకపోతే మీ వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది .

భారతదేశానికి వీసా రహితంగా ఉన్న 57 దేశాలు ఏవి?
భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లు ప్రస్తుతం 57 దేశాలకు వీసా రహితంగా ప్రయాణించవచ్చు. ఈ గమ్యస్థానాలలో థాయిలాండ్ మరియు మారిషస్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు, అలాగే భూటాన్, నేపాల్ మరియు మలేషియా వంటి ఇతర విభిన్న ప్రదేశాలు ఉన్నాయి.

భారతీయులకు US వీసా రహితమా?
భారతీయ పౌరులకు యునైటెడ్ స్టేట్స్‌లోకి ప్రవేశించడానికి చెల్లుబాటు అయ్యే US వీసా అవసరం. భారతదేశం US వీసా మినహాయింపు కార్యక్రమంలో భాగం కాదు.


Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/lady-constable-sexual-harassment-by-police/national/524780/

#telugu News Budget Travel International Travel One Rupee Visa Special Offer Tourism Promotion Travel Deal Visa Discount Visa Offer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.