📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Iran – Israel War : ఆయిల్ కారిడార్ పై ఇరాన్ కీలక నిర్ణయం..

Author Icon By Divya Vani M
Updated: June 22, 2025 • 10:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇరాన్ (Iran) తీసుకున్న తాజా నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది. పర్సియన్ గల్ఫ్‌లోని అత్యంత కీలకమైన హార్మోజ్ జలమార్గాన్ని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ ఓటు వేసింది. ఈ మార్గం భారత్‌కి ప్రత్యేకంగా ముఖ్యమైనది.హార్మోజ్ స్ట్రెయిట్ ద్వారా రోజూ భారత్‌కు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ (Barrels of crude oil) దిగుమతి అవుతుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, ఖతర్, యూఏఈ, ఇరాన్ నుంచి వచ్చే ఆయిల్‌కు ఇదే ప్రధాన మార్గం. ఈ మార్గం ద్వారా ప్రపంచం మొత్తానికి 5 శాతం ఆయిల్, గ్యాస్ సరఫరా జరుగుతుంది.

యుద్ధ భగ్నం – ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు

ఇజ్రాయెల్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఈ చర్య తీసుకుంది. అమెరికా నూక్లియర్ స్థావరాలపై దాడి చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌లోని మూడు న్యూక్లియర్ సైట్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్ హార్మోజ్ మార్గాన్ని మూసేస్తోంది.హార్మోజ్ జలమార్గం అరేబియా మహాసముద్రాన్ని, హిందూ మహాసముద్రాన్ని కలుపుతుంది. దీని వెడల్పు 33 కిలోమీటర్లు కాగా, ఆయిల్ ట్రాన్స్‌పోర్ట్‌కి వాడే లైన్లు కేవలం 3 కిలోమీటర్లే. దాడుల‌కు సులభంగా అవకాశమిచ్చే మార్గమిది.

ఇరాన్ నిర్ణయం వెనుక కారణం

ఈ మార్గం కంట్రోల్ లో ఉంచడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్‌ దేశాలపై ఒత్తిడి తెచ్చే యత్నమిది. ఆయిల్ వ్యాపారంపై ప్రభావం చూపి తమకు అనుకూలంగా జియోపాలిటికల్ పరిణామాలు తీసుకురావాలన్నది ఇరాన్ లక్ష్యం.భారత్‌కు దీన్ని మూసివేత వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఉండవచ్చు. కానీ పారిశ్రామిక నిపుణులు అంతగా ఆందోళన చెందట్లేదు. ఇప్పటికే భారత్ రష్యా, అమెరికా, బ్రెజిల్ లాంటి దేశాల నుంచి ఆయిల్ దిగుమతులు పెంచుతోంది. భవిష్యత్తులో మరిన్ని ప్రత్యామ్నాయ మార్గాలను భారత ప్రభుత్వం అన్వేషించే అవకాశం ఉంది.

Read Also : Pawan Kalyan : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై పవన్‌కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

Closure of the Strait of Hormuz Iran's latest decision Israel-Iran tensions Oil import route for India Strait of Hormuz news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.