📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Operation Sindoor: “బిన్ లాడెన్ వేట” తరహాలో భారత్ ఆపరేషన్ సిందూర్​ : ఉప రాష్ట్రపతి

Author Icon By Shobha Rani
Updated: May 17, 2025 • 3:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ​పై భారత ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఉగ్రవాది బిన్‌ లాడెన్‌ను అమెరికా వేటాడి అంతమొందించిన ఘటనతో ఆపరేషన్‌ సిందూర్‌(Operation Sindoor) ను పోల్చారు. భారత్‌ మునుపెన్నడూ లేని విధంగా పాకిస్థాన్​లోకి చొచ్చుకొని వెళ్లి మరీ ఉగ్రమూకలను ఏరిపారేసిందని చెప్పారు. 2 మే 2011న అమెరికా దళాలు ఇదేవిధంగా వ్యవహరించాయని లాడెన్ పేరు ప్రస్తావించకుండా ధన్​ఖడ్​ (Jagdeep Dhankhar) మాట్లాడారు. “ప్రపంచానికి తెలిసేలా భారత్ చేసి చూపించింది. శాంతియుత వాతావరణానికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉగ్రవాదుల్ని తుదముట్టించడం ద్వారా ఒక గ్లోబల్ బెంచ్‌ మార్క్‌ను సెట్ చేసింది” అని ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ధన్‌ఖడ్‌ అన్నారు. భారత్‌ ఎంతో కచ్చితత్వంతో దాడులు చేసిందని, ఉగ్ర శిబిరాలకు మాత్రమే నష్టం వాటిల్లిందని చెప్పారు.

Operation Sindoor: “బిన్ లాడెన్ వేట” తరహాలో భారత్ ఆపరేషన్ సిందూర్​ : ఉప రాష్ట్రపతి

ఆపరేషన్ సిందూర్‌కు అమెరికా ‘నెప్ట్యూన్ స్పియర్’తో పోలిక
అమెరికా చరిత్రలో అత్యంత విషాద ఘటనగా మిగిలిన ఘటన- వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై 11 సెప్టెంబర్‌ 2001లో (9/11) అల్‌ఖైదా జరిపిన ఉగ్ర దాడి. ఈ దాడిలో దాదాపు మూడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ సంఖ్యలో అమాయకులను పొట్టన పెట్టుకున్న అల్‌ఖైదా అధినేత బిన్‌ లాడెన్‌ను 2011 మే 2న అమెరికా దళాలు ప్రత్యేక ‘ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్​’​ చేసి హతమార్చాయి. యూఎస్‌ నేవీ సీల్‌ బృందం ప్రత్యేక కమాండో ఆపరేషన్‌ చేపట్టి అబొట్టాబాద్‌ కాంపౌండ్‌లో నక్కిన లాడెన్‌ను మట్టుబెట్టింది. ఈ అపరేషన్​కు అప్పటి అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్‌ ఒబామా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దిగుమతుసు లేదా ప్రయాణం ద్వారా భారతదేశ ప్రయోజనాలకు విరుద్ధమైన దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రజలు సహాయం చేయొద్దని జగ్​దీప్​ ధన్​ఖడ్​ (Jagdeep Dhankhar) అన్నారు. ముఖ్యంగా బిజినెస్, కామర్స్​, పరిశ్రమలు భద్రతా సమస్యలతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌కు- తుర్కియే, అజర్​బైజాన్​ మద్దతు ఇచ్చాయి. దీంతో ఆ దేశాలకు బాయ్​కాట్​ సెగ తాగింది. ఆ దేశాలతో వాణిజ్యం, పర్యటకాన్ని బహిష్కరించాలని సోషల్ మీడియా ట్రెండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ధన్​ఖడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
శక్తిమంతమైన, బాధ్యతగల భారత్ దిశగా మరో అడుగు
“మన ప్రయోజనాలకు విరుద్ధమైన దేశాలను మనం శక్తివంతం చేయగలమా? మనలో ప్రతి ఒక్కరూ ఆర్థిక జాతీయవాదం గురించి లోతుగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. దిగుమతి, ప్రయాణం ద్వారా అలాంటి దేశాల ఆర్థికాన్ని మెరుగుపరచడం ఇకపై మనం భరించలేము. భారత సైన్యం అత్యంత కచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని సివిలియన్ ప్రాణాలకు హానికలగకుండా దాడులు నిర్వహించింది. ఆ దేశాలు సంక్షోభ సమయాల్లో మనకు వ్యతిరేకంగా ఉంటాయి” అని ధన్​ఖడ్ (Jagdeep Dhankhar) అన్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ద్వారా భారత్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్ ఇచ్చిన దేశంగా ప్రపంచం ముందు నిలిచింది. ఈ ఘటనతో పాటు ఆర్థిక జాతీయవాదం, ప్రత్యర్థ దేశాలపై వ్యూహాత్మక బహిష్కరణ వంటి అంశాలు ఇప్పుడు దేశ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా చర్చకు వచ్చాయి.

Read Also: India-Pak: ఇండియా నుంచే పాకిస్తాన్‌ ఆర్మీకి సమాచారం.. వ్యక్తి అరెస్ట్‌!

"Bin Laden Hunt": #telugu News Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu on the lines of Paper Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news vice-president

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.