NSE IPO : భారత క్యాపిటల్ మార్కెట్లలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్ అయిన National Stock Exchange (NSE) తన ఐపీఓకు ఎట్టకేలకు నియంత్రణ సంస్థ Securities and Exchange Board of India (SEBI) నుంచి గ్రీన్ సిగ్నల్ పొందింది. దశాబ్దానికి పైగా వాయిదా పడుతూ వచ్చిన ఎన్ఎస్ఈ ఐపీఓ ప్రతిపాదనకు ఇప్పుడు మార్గం సుగమమైంది.
గవర్నెన్స్ లోపాలు, వివాదాస్పద కో-లొకేషన్ కేసు వంటి అంశాల కారణంగా ఇన్నాళ్లూ ఐపీఓ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే తాజాగా సెబీ అనుమతి లభించడంతో, ఐపీఓ సమయంపై తుది నిర్ణయం తీసుకునే దిశగా ఎన్ఎస్ఈ యాజమాన్యం అడుగులు వేస్తోంది. నివేదికల ప్రకారం, మార్చి చివరి నాటికి డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సెబీకి సమర్పించే అవకాశం ఉంది.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
ఈ నిర్ణయంపై ఎన్ఎస్ఈ ఛైర్‌పర్సన్ శ్రీనివాస్ (NSE IPO) ఇంజేటి ఆనందం వ్యక్తం చేశారు. ఇది సంస్థ వృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయి అని, వాటాదారులకు మరింత విలువ సృష్టించే కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్ఎస్ఈ కీలక పాత్రను ఈ ఆమోదం మరింత బలపరుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం, ఈ ఐపీఓ భారత క్యాపిటల్ మార్కెట్ చరిత్రలోనే అత్యంత కీలక పబ్లిక్ ఇష్యూలలో ఒకటిగా నిలవనుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: