📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Nokia: భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది

Author Icon By Vanipushpa
Updated: February 11, 2026 • 11:21 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌లో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటిదాకా 2జీ, 4జీ, 5జీ ప్రపంచాన్ని చూసిన యూజర్లు త్వరలో ఏకంగా 100 జీ చూడబోతున్నారు. దీనికి వేదికగా భారత్ మారబోతోంది. ప్రముఖ దిగ్గజం ఈ టెక్నాలజీపై గట్టిగా కృషి చేస్తోంది. సాధారణంగా ఇంటర్నెట్ అనేది మన జీవితాలో విడదీయలేని భాగం అయిపోయింది. టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు నెమ్మదిగా లోడ్ అయ్యే వెబ్‌పేజీలు, వీడియోలు బఫర్ అవుతూ ఆగిపోవడం సాధారణంగా ఉండేది. కానీ స్మార్ట్‌ఫోన్‌లు విస్తృతంగా అందుబాటులోకి రావడం, 4G ఇంటర్నెట్ ప్రవేశంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన డేటా సేవలు అందించడానికి టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ పోటీ కారణంగా ఇంటర్నెట్ టెక్నాలజీలో భారీ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి జరుగుతోంది.

Read Also: Corruption : భారత్ లో తగ్గిన అవినీతి

భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది

ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచే టెక్నాలజీ అభివృద్ధి

ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధ టెలికాం సంస్థ నోకియా(Nokia) భారత్‌లో ఒక కీలక ముందడుగు వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నోకియా తన అతిపెద్ద నెట్‌వర్క్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం ఏమిటంటే భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచే టెక్నాలజీలను అభివృద్ధి చేయడం. ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన పరిశోధనల్లో ఒకటి ఏంటంటే.. 100G ఇంటర్నెట్ టెక్నాలజీ. అయితే, ఈ 100G ఇంటర్నెట్ అంటే ఏమిటి అని చాలామందికి అనుమానం రావొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటేడ 100G అంటే సెకనుకు 100 గిగాబిట్‌ల డేటా బదిలీ వేగం (100 Gbps). ప్రస్తుతం మనం చాలా వేగంగా భావించే 100 Mbps లేదా 1 Gbps కనెక్షన్లతో పోలిస్తే ఇది వందల రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ డేటా ప్రసరణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. 100G ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో డేటా విద్యుత్ సంకేతాలుగా కాకుండా.. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో కోహెరెంట్ ఆప్టిక్స్ అనే ఆధునిక సాంకేతికత ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఒకే ఫైబర్ కేబుల్ ద్వారా భారీ మొత్తంలో డేటాను ఒకేసారి పంపడం సాధ్యమవుతుంది. చెన్నైలోని నోకియా పరిశోధనా కేంద్రం ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా మార్చే పనిలో ఉంది. 100G వంటి సూపర్ ఫాస్ట్ వేగాలను సాధించడానికి DWDM (Dense Wavelength Division Multiplexing) కీలక పాత్ర పోషిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

100G Internet High speed internet India India telecom news Nokia 100G broadband Nokia India Nokia network technology Telugu News Paper Telugu News Today Ultra fast internet

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.