నోబెల్ శాంతి బహుమతి తనకు ఇవ్వకూడదని నార్వే నిరణయించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపింన సందేశంపై ఆ దేశ ప్రధాని జోనస్ గా స్టోర్ స్పందించారు. నోబెల్ అవార్డులను నిర్ణయించే అధికారం నార్వే ప్రభుత్వానికి లేదని తెలిపారు. కేవంల నోబెల్ కమిటీకి మాత్రనే నిర్ణయించే అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్ నుంచి సందేశం వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) స్వతంత్ర నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది. దీనిపై నార్వే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు కూడా స్పష్టంగా వివరించా. నోబెల్ శాంతి బహుమతి దక్కకపోవడం వల్ల తన గ్లోబల్ రాజకీయ దృక్పథం, మైత్రి దేశాలపై విధానం మారిందని ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ముందు రోజు నార్వే, ఫిన్లాండ్ తరఫున పంపిన ఒక చిన్న సందేశానికి ప్రతిస్పందనగా ఇది వచ్చింది. ఆ సందేశంలో నార్వే, ఫిన్లాండ్, యూరోపియన్ యూనియన్ దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ బెదిరింపులకు మేం వ్యతిరేకతను వ్యక్తం చేశాం.
Read Also: Huge Explosion : కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
డర్ స్టబ్, నేను ముగ్గురం కలిసి ఫోన్‌లో మాట్లాడుదామని ప్రతిపాదించాం. సందేశం పంపిన కొద్ది సేపటికే ట్రంప్ నుంచి స్పందన వచ్చింది. ఆ సందేశాన్ని ఇతర నాటో నాయకులతో పంచుకోవాలనేది ఆయన నిర్ణయం’ అని జోనస్ గా స్టోర్ తెలిపారు.
8కి పైగా యుద్ధాలు ఆపినా నోబెల్ దక్కలేదు: ట్రంప్
గ్రీన్లాండ్ అంశాన్ని నోబెల్ శాంతి బహుమతితో ముడిపెడుతూ నార్వే ప్రధాని టెలిఫోన్ సందేశాన్ని పంపించారు డొనాల్డ్ ట్రంప్. అందులో తాను 8కి పైగా యుద్ధాలు ఆపానని అయినా తనకు నోబెల్ పురస్కారం ఇవ్వకూడదని నార్వే నిర్ణయించిందని పేర్కొన్నారు. నార్వే తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వకపోవడం వల్ల తన ప్రపంచ రాజకీయ దృక్పథం మారిపోయిందని తెలిపారు. ఇకపై శాంతి గురించి తాను ఆలోచించనని, అమెరికా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. ట్రంప్ సందేశంలో మరో కీలక అంశం గ్రీన్లాండ్. దానిని అమెరికా స్వాధీనం చేసుకోవాలన్న తన అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: