ప్రతిష్టాత్మకమైన నోబెల్ (Nobel) బహుమతుల వార్షిక ప్రకటనలు ఈసారి కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ఆసక్తిని రేకెత్తించాయి. గత వారం ప్రారంభమైన నోబెల్ పురస్కారాల ప్రకటనల సిరీస్ నేటితో ముగిసింది. చివరి విభాగమైన ఆర్థిక శాస్త్రం (Economics) విభాగంలో విజేతల పేర్లను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్ అనే ముగ్గురు ఆర్థిక శాస్త్రవేత్తలు సంయుక్తంగా నోబెల్ బహుమతి (Nobel Prize) కి ఎంపికయ్యారు.
Read Also: Japan PR : జపాన్‌లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
ఇక వీరందరికీ డిసెంబర్ 10వ తేదీన నోబెల్ బహుమతుల ప్రదానం జరగనుంది.జోయెల్ మోకిర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోవిట్‌లు.. అర్థశాస్త్రంలో చేసిన విశేష కృషిని గుర్తించి.. ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు నోబెల్ కమిటీ (Nobel Committee) తెలిపింది.
ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం
‘ఆవిష్కరణ-ఆధారిత ఆర్థిక వృద్ధిని వివరించినందుకు’.. ‘సాంకేతిక పురోగతి ద్వారా స్థిరమైన వృద్ధికి ముందస్తు అవసరాలను గుర్తించినందుకు’.. ‘సృజనాత్మక విధ్వంసం ద్వారా స్థిరమైన వృద్ధి సిద్ధాంతం కోసం’ ఈ ముగ్గురు చేసిన సేవలను గుర్తిస్తూ.. వీరికి నోబెల్ బహుమతి సంయుక్తంగా ప్రదానం చేయాలని రాయల్ స్వీడిష్ అకాడమీ (Royal Swedish Academy) నిర్ణయించింది.
మరోవైపు.. గత శుక్రవారం ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతి.. వెనిజులా ఎంపీ మరియా కొరినా మచాడోకు దక్కింది. ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం మరియా కొరినా మచాడో (Maria Corina Machado) చేసిన కృషికి ఈ నోబెల్ బహుమతి ఆమెకు వరించింది. ఇక నోబెల్ శాంతి బహుమతి కోసం గంపెడు ఆశలు పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు చుక్కెదురైంది.
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడేనా?
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: