📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nobel prize : భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

Author Icon By Shiva
Updated: October 7, 2025 • 4:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నోబెల్ ఫిజిక్స్ బహుమతి 2025 – ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలకు గౌరవం

2025 సంవత్సరానికి గాను భౌతికశాస్త్ర విభాగంలో నోబెల్ బహుమతిను(Nobel prize)ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. జాన్ క్లార్క్(John Clarke),మైఖేల్ హెచ్. డివోరెట్, మరియు జాన్ ఎం. మార్టినిస్ లను ఈ గౌరవానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. అణువుల స్థాయిలో మాత్రమే సాధ్యమనుకున్న క్వాంటం భౌతికశాస్త్ర సూత్రాలను, కంటికి కనిపించేంత పెద్ద ఎలక్ట్రిక్ సర్క్యూట్లో విజయవంతంగా ప్రదర్శించినందుకు వారికి ఈ అవార్డు దక్కింది.

Read also: భగ్గుమన్న భూగోళం.. వాతావరణ మార్పుల మోత! లక్ష ప్రాణాలను మింగేసిన

క్వాంటం టన్నెలింగ్ పై విప్లవాత్మక పరిశోధన

క్వాంటం మెకానిక్స్ ప్రకారం, ఒక కణం తనకు అడ్డుగా ఉన్న గోడను దాటగలదనే సూత్రాన్ని టన్నెలింగ్ అంటారు. ఇది సూక్ష్మ స్థాయిలో మాత్రమే సాధ్యమని భావించిన అభిప్రాయాన్ని ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు 1984-85 మధ్య చేసిన ప్రయోగాలతో తప్పు అని నిరూపించారు.
వారు రూపొందించిన సూపర్ కండక్టర్ సర్క్యూట్‌లో విద్యుత్ ప్రవహింపజేసినప్పుడు అందులోని కణాలు ఒక్కటిగా ప్రవర్తించడం గమనించి, క్వాంటం టన్నెలింగ్‌ను స్థూల స్థాయిలో నిరూపించారు. అదేవిధంగా, ఈ సర్క్యూట్ నిర్దిష్ట పరిమాణంలోనే శక్తిని గ్రహించడం లేదా విడుదల చేయడం ద్వారా ఎనర్జీ క్వాంటైజేషన్ను కూడా ప్రదర్శించారు.

నోబెల్(Nobel prize) కమిటీ ఛైర్ ఓల్ ఎరిక్సన్ మాట్లాడుతూ, క్వాంటం మెకానిక్స్ శతాబ్దాలుగా కొత్త ఆశ్చర్యాలను అందిస్తోంది. ఇది భవిష్యత్ డిజిటల్ టెక్నాలజీలకు పునాది అని అన్నారు.
ఈ పరిశోధనల ఫలితంగా క్వాంటం కంప్యూటర్లు, క్వాంటం సెన్సార్లు, మరియు క్వాంటం క్రిప్టోగ్రఫీ వంటి సాంకేతికతలకు కొత్త దిశ లభించనున్నదని నిపుణులు భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

Intrenational news John Clarke John M. Martinis latest news Michael H. Devoret Nobel Prize 2025 Physics Nobel 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.