📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

వడ్డీ రేట్లను తగ్గిచం: ట్రంప్

Author Icon By Vanipushpa
Updated: January 30, 2025 • 10:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గడచిన కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లతో పాటు పెట్టుబడిదారులు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ పాలసీ రేట్ల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దీనికి కారణం ట్రంప్ అధ్యక్షుడిగా రెండవసారి అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత మెుదటిసారి ఫెడ్ ద్రవ్య విధానాన్ని ప్రకటించటమే. ట్రంప్ వాణిజ్య విధానాలపై ఉన్న అనిశ్చితుల కారణంగా ఫెడ్ కూడా జాగ్రత్తగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో వడ్డీ రేట్ల తగ్గింపుకు పాజ్ ప్రకటించబడింది. వాస్తవానికి 2024లో ఫెడ్ ఏకంగా 100 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ప్రస్తుత ప్రకటన రావటం గమనార్హం. ఫెడ్ అమెరికాలో ఉపాధి అవకాశాల పెంపుతో పాటు ద్రవ్యోల్బణాన్ని రానున్న కాలంలో 2 శాతానికి తీసుకురావటానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

వాస్తవానికి గడచిన డిసెంబరులో అమెరికాలో ద్రవ్యోల్బణం 2.9 శాతానికి పెరుగుదలను నమోదు చేసింది. వాస్తవానికి ఇది 2024 నవంబరులో 2.7 శాతం కంటే ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ఫెడ్ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యం 2 శాతానికి తీసుకురావటానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే వడ్డీ రేట్ల విషయంలో పావెల్ కఠినంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. ఉపాధి , ద్రవ్యోల్బణం అంశాలపై ఉన్న ఆందోళనలపై ఫెడ్ తన శ్రద్ధను కొనసాగిస్తున్నట్లు జనవరి 30న ఫెడ్ కమిటీ మిటింగ్ వెల్లడించింది. ఆర్థిక కార్యకలాపాలు పటిష్టమైన వేగంతో కొనసాగుతున్నాయని ఇటీవలి సూచికలు సూచిస్తున్నాయని ఫెడ్ తాజా మానిటరీ సమావేశంలో వెల్లడించింది. దీని కారణంగా ఇటీవలి నెలల్లో నిరుద్యోగిత రేటు తక్కువ స్థాయిలో స్థిరంగా కొనసాగుతోందని ఫెడ్ వెల్లడించింది. కార్మిక మార్కెట్ పరిస్థితులు పటిష్టంగా ఉండగా.. ద్రవ్యోల్బణం మాత్రం కొంతవరకు పెరిగిందని ఫెడ్ ప్రకటించింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని 2 శాతం లక్ష్యానికి తిరిగి తీసుకురావడానికి కమిటీ కట్టుబడి ఉందని, తీవ్రంగా ప్రయత్నిస్తోందని వెల్లడించింది.

Donald Trump Fed interest rates No reduction USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.