Elon musk: కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

Read Time:  1 min
కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..
కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..
FONT SIZE
GET APP

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ (Elon musk) మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన తన వ్యాపారాల వల్ల కాకుండా, సంతోషం , డబ్బు గురించి చేసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు. సుమారు 852 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 71 లక్షల కోట్లు) ఆస్తితో ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఈ స్థాయికి చేరిన వ్యక్తిగా చరిత్ర సృష్టించిన కొద్ది రోజులకే ఆయన ఈ పోస్ట్ చేయడం విశేషం మస్క్ ఏమన్నారంటే? ఎలన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’లో ఒక పాత సామెతను గుర్తు చేస్తూ.. “డబ్బుతో సంతోషాన్ని కొనలేము అని ఎవరు అన్నారో కానీ వారు చెప్పింది అక్షరాలా నిజం” అని రాశారు. దీనికి చివరలో ఒక విచారంగా ఉన్న ఎమోజీని కూడా జత చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తి నుండి ఇలాంటి మాటలు రావడంతో అది కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. నెటిజన్ల రియాక్షన్లు మస్క్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు జోకులు పేలుస్తుండగా.. మరికొందరు జీవిత సత్యాలను వివరిస్తున్నారు.

Read Also: Digital services: ఇంటర్నెట్ లేని ఇళ్లు 13.7 శాతం

 Elon musk: కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..
Elon musk: కోట్ల ఆస్తి ఉన్నా సంతోషం లేదు..

మస్క్ ట్వీట్‌పై నెటిజన్ల కౌంటర్లు

ఒక యూజర్ ఫన్నీగా స్పందిస్తూ.. “సార్, నాకు ఒక 1 మిలియన్ డాలర్లు పంపండి.. అప్పుడు మీ బాధ ఏంటో నాకు అర్థమవుతుంది. అది నిజమో కాదో నేనే చెప్తా” అని సరదాగా కామెంట్ చేశారు. మరొక నెటిజన్.. “అద్దె కట్టాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి వేదాంతం మాట్లాడటం చాలా ఈజీ” అని ఎద్దేవా చేశారు. ఇకపోతే మరొక నెటిజన్.. “డబ్బు సంతోషాన్ని గ్యారెంటీ ఇవ్వకపోవచ్చు. కానీ, డబ్బు లేకపోతే వచ్చే ఒత్తిడి మాత్రం నరకం చూపిస్తుంది. తిండి, గూడు కోసం చింత లేనప్పుడే అసలైన ప్రశాంతత దొరుకుతుంది” అని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 852 బిలియన్ డాలర్ల సంపద ఎలా వచ్చింది? ఎలన్ మస్క్ (Elon musk) నెట్ వర్త్ ఒక్కసారిగా పెరగడానికి కారణం ఆయన తీసుకున్న ఒక భారీ వ్యాపార నిర్ణయం. మస్క్ తన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ (SpaceX) ద్వారా తన సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘xAI’ ని కొనుగోలు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

 Job Alerts

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.