📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News : NISAR Satellite: ఆప‌రేష‌న్‌లోకి నిసార్ ఉప‌గ్ర‌హం : ఇస్రో చీఫ్‌

Author Icon By Sudha
Updated: November 5, 2025 • 4:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ(ఇస్రో) చైర్మెన్ వీ నారాయ‌ణ‌న్ కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. అమెరికాకు చెందిన నాసాతో క‌లిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి ప్ర‌యోగించిన నిసార్ ఉప‌గ్ర‌హం(NISAR Satellite) న‌వంబ‌ర్ 7వ తేదీ నుంచి ఆప‌రేష‌న్‌లోకి వ‌స్తుంద‌న్నారు. నాసా-ఇస్రో సింథ‌టిక్ అపార్చ‌ర్ రేడార్(ఎన్ఐఎస్ఏఆర్) అత్యంత ఖ‌రీదైన ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్‌. భూ గ్ర‌హంపై ఉన్న మంచు కేంద్రాల‌ను ప్ర‌తి 12 రోజుల‌కు రెండుసార్లు మానిట‌ర్ చేసే సామ‌ర్థ్యం ఆ ఉప‌గ్ర‌హానికి ఉన్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.జూలై 30వ తేదీన జీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ నుంచి ఆ శాటిలైట్‌ను ప్ర‌యోగించారు. నిసార్ బ‌రువు సుమారు 2400 కేజీలు. డేటా స‌మీక‌ర‌ణ పూర్తి అయ్యింద‌ని, న‌వంబ‌ర్ 7వ తేదీన జ‌రిగే భేటీలో శాటిలైట్‌ను అప‌రేష‌న‌ల్‌గా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు నారాయ‌ణ‌న్ అన్నారు. ఎమ‌ర్జింగ్ సైన్స్‌, టెక్నాల‌జీ, ఇన్నోవేష‌న్ కాన్‌క్లేవ్ స‌ద‌స్సులో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు.

Read Also : http://Kerala HC: రెండో పెళ్లికి ముందు భార్య అంగీకారం తప్పనిసరి: కేరళ హైకోర్టు

NISAR Satellite

నిసార్ శాటిలైట్‌ (NISAR Satellite)లో రెండు సార్ సిస్ట‌మ్స్ ఉన్నాయి. ఒక‌టి ఎల్ బ్యాండ్‌. మ‌రొక‌టి ఎస్ బ్యాండ్ సెన్సార్‌. ఎల్ బ్యాండ్ రేడార్‌.. అడ‌వును స్కాన్ చేసి అక్క‌డ నేత సాంద్ర‌త‌ను, ఫారెస్ట్ బ‌యోమాస్‌, ఐస్ స‌ర్ఫేస్‌ను అంచ‌నా వేస్తుంది. ఇక ఎస్ బ్యాండ్ రేడార్‌.. వ్య‌వ‌సాయ‌, గ్రాస్‌ల్యాండ్ ఎకోసిస్ట‌మ్‌, మంచు తేమ‌ను స్ట‌డీ చేయ‌నున్న‌ది. మేఘాలు, హిమ‌పాతం నుంచి రెండు సిస్ట‌మ్‌లు డేటాను సేక‌రిస్తాయ‌న్నారు. నిసార్ అందించే డేటా అసాధార‌ణ‌మైంద‌ని, ప్ర‌తి 12 రోజుల‌కు ఓసారి భూమిని స్కాన్ చేయ‌వ‌చ్చు అని, ఈ శాటిలైట్ చాలా ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని నారాయ‌ణ‌న్ అన్నారు.

నిసార్ ఉపగ్రహం దేనికి ఉపయోగించబడుతుంది?

NISAR ఉపగ్రహం యొక్క ఉద్దేశ్యం భూమి, మంచు మరియు పర్యావరణ వ్యవస్థలతో సహా భూమి ఉపరితలంపై మార్పులను సమగ్రంగా అధ్యయనం చేయడం, దాని డ్యూయల్-బ్యాండ్ రాడార్ వ్యవస్థను ఉపయోగించడం. భూకంపాలు మరియు అగ్నిపర్వత కార్యకలాపాలు వంటి సహజ ప్రమాదాలను పర్యవేక్షించడం, మంచు పలక మరియు హిమానీనద కదలికను ట్రాక్ చేయడం, అటవీ బయోమాస్‌ను మ్యాప్ చేయడం మరియు చిత్తడి నేలలు మరియు వ్యవసాయంలో మార్పులను అర్థం చేసుకోవడం దీని లక్ష్యం.

మొదటి ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు?

అక్టోబర్ 4, 1957 న సోవియట్ యూనియన్ స్పుత్నిక్ Iని విజయవంతంగా ప్రయోగించినప్పుడు చరిత్ర మారిపోయింది. ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం బీచ్ బాల్ పరిమాణం (58 సెం.మీ. లేదా 22.8 అంగుళాల వ్యాసం), కేవలం 83.6 కిలోలు లేదా 183.9 పౌండ్ల బరువు కలిగి ఉంది మరియు భూమిని దాని దీర్ఘవృత్తాకార మార్గంలో కక్ష్యలోకి తీసుకురావడానికి దాదాపు 98 నిమిషాలు పట్టింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

Breaking News Indian Space Research ISRO latest news nasa NISAR satellite space mission Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.