📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangladesh: భారత్ కు చేరుకున్న 9మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు

Author Icon By Vanipushpa
Updated: January 26, 2026 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుసగా దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అనేక చోట్ల హిందువులపై దాడులు చేస్తూ చంపేస్తున్నారు. వారి ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నారు. దీంతో అక్కడి హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌(Bangladesh)లో పని చేస్తున్న భారతీయులు చాలా మంది ఇండియాకు తిరిగొచ్చేస్తున్నారు. ప్రైవేటు రంగంలోనే కాకుండా.. భారత రాయబార కార్యాలయంతోపాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న కేంద్ర సంస్థల ఉద్యోగులు కూడా బంగ్లాను వీడుతున్నారు.

Read Also: Budget 2026: బడ్జెట్‌పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!

Bangladesh: భారత్ కు చేరుకున్న 9మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు

కుటుంబంతో కలిసి అక్కడ ఉండటం క్షేమం కాదు

తాజాగా 9 మంది ఎన్టీపీసీ ఇంజినీర్లు బంగ్లాదేశ్‌ను వదిలి ఇండియా వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర విద్యుత్ రంగ సంస్థ అయిన ఎన్టీపీసీకి చెందిన ఉద్యోగులు కొందరు బంగ్లాదేశ్‌లో డిప్యుటేషన్‌పై పని చేస్తున్నారు. ఇండియా-బంగ్లా మధ్య ఉన్న మైత్రి ప్రకారం బంగ్లాదేశ్ ఇండియా ఫ్రెండ్‌షిప్ పవర్ కంపెనీ నిర్వహిస్తున్న రాంపాల్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో పని చేస్తున్నారు. దీనికి వారు అక్కడి అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని సమాచారం. అలాగే నోటీసులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది. అక్కడి ఉద్యోగులను తనిఖీ చేయగా.. వారు విధులకు రాలేదని తెలియడంతో విచారించారు. వారు ఇండియా వెళ్లిపోయారని తెలిసింది. భోమ్రా మార్గం ద్వారా వారు ఇండియా వచ్చినట్లు గుర్తించారు. బంగ్లాలో ఉన్న భారత ఉద్యోగులకు ఇండియన్ ఎంబసీ ఇప్పటికే ఒక సూచన చేసింది. కుటుంబంతో కలిసి అక్కడ ఉండటం క్షేమం కాదని, కుటుంబాల్ని ఇండియాకు పంపించాలని సూచించింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Energy Sector government PSU news India arrival Indian engineers nine engineers return NTPC engineers NTPC updates power sector news Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.