📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! ప్రధాని మోదీకి అరుదైన గౌరవం యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

Nimisha Priya: కేరళ నర్సుకు యెమెన్‌ లో జులై 16న ఉరిశిక్ష

Author Icon By Vanipushpa
Updated: July 9, 2025 • 11:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యెమెన్‌(Yemen)లో వ్యాపార భాగస్వామిని హత్య చేసిన కేసులో కేరళ నర్సు-నిమిష ప్రియ(Nimisha Priya)కు పడిన మరణశిక్ష(Death Penalty)ను ఈనెల 16న అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే యెమెన్‌ దేశాధ్యక్షుడు రషాద్‌ అల్‌ అలిమి(President Rashad al Alimi) ఇందుకు ఆమోదం తెలపగా 16న ఆమెకు శిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన విషయాన్ని కేరళలోని నిమిష కుటుంబీకులకు యెమెన్‌ జైలు అధికారులు తెలియజేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే, ప్రియను కాపాడేందుకు భారత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది.

యెమెన్‌ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు

ఈ కేసును తాము నిశితంగా పరిశీలిస్తున్నామని స్థానిక అధికారులు, నిమిష కుటుంబ సభ్యులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు దిల్లీ వర్గాలు చెప్పాయి. అయితే, ప్రస్తుతం 38 ఏళ్ల నిమిష హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న యెమెన్‌ రాజధాని సనాలోని జైల్లో ఉన్నారు. అటు భారత పక్షానికి హౌతీ తిరుగుబాటుదారులతో అధికారిక సంబంధాలు లేనందున చర్చలు కష్టతరంగా మారాయి. అటు మృతుడి కుటుంబానికి బ్లడ్‌ మనీ దియా చెల్లించి క్షమాభిక్ష పొందేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ప్రియా తల్లి ప్రేమకుమారి ఆమెను విడుదల చేసే ప్రయత్నాలలో భాగంగా గతేడాది యెమెన్‌కు వెళ్లారు.

Nimisha Priya: కేరళ నర్సుకు జులై 16న ఉరిశిక్ష

కేరళ పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష నర్సు

కేరళ పాలక్కాడ్‌ జిల్లాకు చెందిన నిమిష నర్సు కోర్సు పూర్తి చేసిన తర్వాత 2008లో యెమెన్‌ వెళ్లి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్‌ను వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్‌ తెరవాలనుకొన్నారు. ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్‌ అదిబ్‌ మెహది అనే వ్యక్తిని నిమిష, థామస్‌ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకొన్నారు. అల్‌అమన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సెంటర్‌ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యెమెన్‌లోనే ఉంటూ సెంటర్‌ను కొనసాగించారు.

చివరి నిమిషంలో కూడా ఆమె క్షమాభిక్ష కోసం చర్చలు

ఈ సమయంలో మెహది ప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురిచేస్తూ ఆమె పాస్‌పోర్టు లాక్కొన్నాడు. అతడిపై 2016లో ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోకపోయేసరికి, 2017లో మెహదికి మత్తు మందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువవడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష పడింది. చివరి నిమిషంలో కూడా ఆమె క్షమాభిక్ష కోసం చర్చలు జరుగుతున్నాయి.  

2018లో మహదీ హత్య కేసులో నిమిషను దోషిగా కోర్టు నిర్ధారించింది. గత ఏడాది డిసెంబర్ 30న, యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్-అలిమి 2017 నుండి జైలులో ఉన్న నిమిషా ప్రియకు మరణశిక్షను ఆమోదించారు.  కాగా  బాధితురాలి కుటుంబానికి పరిహారంగా చర్చల బృందం ఒక మిలియన్ USD అందించనున్నట్లు సమాచారం. .

నిమిషా ప్రియ చేసిన నేరం ఏమిటి?
జాన్ బ్రిట్టాస్. (ఎ నుండి డి వరకు) యెమెన్ జాతీయుడిని హత్య చేసిన నేరంపై సనాలోని యెమెన్ సుప్రీంకోర్టు భారతీయ నర్సు శ్రీమతి నిమిషా ప్రియకు మరణశిక్ష విధించింది. శ్రీమతి కేసుకు సంబంధించి పౌర సమాజం నుండి సహా ప్రభుత్వం కొన్ని ప్రాతినిధ్యాలను అందుకుంది.
నిమిషా ప్రియ ఎంత బ్లడ్ మనీని పొందింది?
పాలక్కాడ్‌లోని కొల్లంగోడ్‌కు చెందిన నిమిషా ప్రియ, యెమెన్ పౌరుడు తలాల్ అబ్దుల్ మహదీ హత్య కేసులో 2017 నుండి సనాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. దియా (రక్త డబ్బు)గా చెల్లించిన $40,000లో ఏ భాగాన్ని కూడా పొందలేదని తలాల్ కుటుంబం చెబుతోందని సుభాష్ చంద్రన్ అన్నారు.

Read News hindi: hindi.vaartha.com

Read Also:Texas: టెక్సాస్‌లో భారీ వరదలు: మృతుల సంఖ్య 100 దాటింది

#telugu News death penalty Indian Nurse in Yemen Kerala nurse Latest News Breaking News Nimisha Priya Yemen Execution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.