📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

Author Icon By Vanipushpa
Updated: July 15, 2025 • 3:01 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నిమిష ప్రియ(Nimisha Priya)కు జులై 16న యెమెన్‌(Yemen)లో మరణశిక్ష విధించనున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం వాయిదా వేసినట్లు భారత విదేశాంగ శాఖ(indian external affairs Department) వర్గాలు వెల్లడించాయి. ఆమెను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమెను రక్షించేందుకు బ్లడ్ మనీ ఒక్కటే దారి. అంటే బాధిత కుటుంబానికి భారీ మొత్తంలో పరిహారం ఇవ్వాలి. నిమిష ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే రూ.8.6 కోట్లు బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది.
మత పెద్దలతో ఆయన చర్చలు
మరోవైపు భారత్‌కు చెందిన ఓ ప్రముఖ మత గురవు కూడా నిమిష ప్రియను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆమె శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్.. బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆమె తరపు న్యాయవాది పేర్కొన్నారు. బాధిత కుటుంబంతో పాటు యెమెన్ స్థానిక అధికారులు, అక్కడి మత పెద్దలతో ఆయన చర్చలు జరుపుతున్నారు. బ్లడ్ మనీని తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Nimisha Priya: నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది
నిమిష ప్రియ కేరళలో నర్సింగ్ కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్‌కు వెళ్లి అక్కడే జాబ్‌లో చేరింది. 2011లో కేరళకు వచ్చి థామస్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత యెమెన్‌లోని ఓ క్లినిక్‌ను ప్రారంభించాలనుకుంది. అయితే ఆ దేశ రూల్స్ ప్రకారం స్థానిక వ్యక్తి వ్యాపార భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుంది. ఇందుకోసం నిమిష అక్కడున్న తలాల్ అదిబ్ మెహది అనే వ్యక్తిని వ్యాపార భాగస్వామిగా చేసుకుంది. వీళ్లద్దరూ కలిసి మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను ప్రారంభించారు.
పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు మెహదికి మత్తుమందు ఇచ్చింది
నిమిష భర్త, కూతురు మాత్రం కేరళలోనే ఉండిపోయారు. దీన్ని ఆసరగా చేసుకొని మెహది.. నిమిష ప్రియ నుంచి డబ్బు లాక్కునేవాడని, వేధించేవాడని ఆమె కుటుంబం ఆరోపించింది. ఆఖరికి ఆమె పాస్‌పోర్టును కూడా లాక్కున్నాడని చెప్పారు. దీంతో నిమిష.. తన పాస్‌పోర్టును స్వాధీనం చేసుకునేందుకు 2017లో మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ డోస్‌ ఎక్కువైపోవడంతో అతడు మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహాన్ని ఆమె వాటర్‌ట్యాంక్‌లో పడేసింది. చివరికి ఆమె సౌదీకి వెళ్తుండగా.. సరిహద్దుల్లో ఆమెను అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు నిమిష ప్రియకు ఉరిశిక్ష విధించింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also : Chandrababu : నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

#telugu News death penalty case death sentence delay Indian Nurse in Yemen international law legal stay mercy petition Nimisha Priya Nimisha Priya execution

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.