📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Nimisha Priya case: ‘నిమిష’ ఉరిశిక్షను ఆపలేం.. కేంద్రం స్పష్టం

Author Icon By Vanipushpa
Updated: July 14, 2025 • 4:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జులై 16న యెమెన్‌(Yemen)లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) పిటిషన్ సుప్రీంకోర్టు(Suprem court)లో సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతితక్కువని కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ప్రియ ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు.

Nimisha Priya case: ‘నిమిష’ ఉరిశిక్షను ఆపలేం.. కేంద్రం స్పష్టం

భారత ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న అవకాశాలు అతి తక్కువ

నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి దౌత్యపరమైన చర్చల ద్వారా రక్షించేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో జులై 10వ తేదీన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తన వాదనలు వినిపించారు. జులై 16న కేరళ నర్సు మరణశిక్షను ఆపేందుకు లేదా వాయిదా వేయించేందుకు భారత ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న అవకాశాలు అతి తక్కువని ఆమె తెలిపారు. భారత్‌-యెమెన్‌ల మధ్య దౌత్యపరంగా సత్సంబంధాలు లేకపోవడమూ ఒక కారణమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయగలిగిందేమి లేదు

యెమెన్ సున్నితత్వాన్ని దృష్టిపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో పెద్దగా చేయగలిగిందేమి లేదని అన్నారు. ఇక బ్లడ్ మనీ మాత్రమే నిమిషను కాపాడేందుకు ఉన్న చిట్టచివరి అవకాశం అని.. అది కూడా ప్రైవేటు ఒప్పందం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. యెమెన్ షరియా చట్టం ప్రకారం, బాధిత కుటుంబం “బ్లడ్ మనీ” (దియా) స్వీకరిస్తే ఉరిశిక్షను రద్దు చేయవచ్చు. నిమిషా కుటుంబం మరియు “సేవ్ నిమిషా ప్రియా ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్” $1 మిలియన్ (సుమారు ₹8.6 కోట్లు) బ్లడ్ మనీగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే, మహదీ కుటుంబం ఇంకా సమ్మతం తెలపలేదు. నిమిషా తల్లి ప్రేమ కుమారి, సనాలో ఉంటూ, సామూల్ జెరోమ్ అనే కార్యకర్త సహాయంతో బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: World Chimpanzee Day 2025: నేడు ప్రపంచ చింపాంజీ దినోత్సవం

#telugu News Death Penalty Yemen Diplomatic Intervention Fails India Yemen Diplomatic Issue Indian Nurse Execution Latest News Breaking News MEA on Nimisha Priya Nimisha Priya Case Nimisha Priya Verdict Supreme Court India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.