📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Yemen: నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్

Author Icon By Vanipushpa
Updated: October 16, 2025 • 4:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

యెమెన్‌లో భారతీయ నర్సు నిమిష ప్రియ(Nimisha Priya) మరణశిక్షపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. ఆమెకు విధించిన మరణశిక్షపై ప్రస్తుతం స్టే కొనసాగుతోందని సుప్రీంకోర్టు(Supemcourt)కు కేంద్రం గురువారం తెలిపింది. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి తీవ్రమైన పరిణామాలు జరగలేదని పేర్కొంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారతీయ నర్సును కాపాడేందుకు కేంద్రం దౌత్యమార్గాలను వాడుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ గతంలో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

Read Also: PF: EPFO సందేహాలపై కేంద్రం క్లారిటీ

వచ్చే ఏడాది జనవరికి వాయిదా

తాజాగా సుప్రీంకోర్టు ఆమె మరణశిక్ష గురించి ప్రశ్నించింది. దీంతో ఆమెకు చట్టపరమైన సహకారం అందిస్తోన్న ‘సేవ్ నిమిషప్రియ(Nimisha Priya) ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్‌’ తరఫు న్యాయవాది దీని గురించి మాట్లాడారు. నిమిష ప్రియ మరణశిక్ష అమలుపై స్టే కొనసాగుతుందని తెలిపారు. ఈ కేసులోకి కొత్త మధ్యవర్తి వచ్చారని కేంద్రం తరఫు అటర్నా జనరల్‌ వెంకటరమణి తెలిపారు. మంచి విషయం ఏంటంటే ఇప్పటిదాకా ఎలాంటి తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకోలేదని చెప్పారు. చివరికి ఈ వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం ఈ కేసును వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. ఏవైనా అత్యవరస పరిస్థితులు తలెత్తితే ముందుస్తు జాబితా కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

Yemen: నిమిష ప్రియకేసులో తాజా అప్‌డేట్

కేసు పూర్వాపరాలు ఏంటీ

కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అనంతరం 2008లో యెమెన్‌కు వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో చేరారు. అయితే ఆ దేశ రూల్స్‌ ప్రకారం స్థానిక వ్యక్తి తలాల్ అదిబ్ మెహది భాగస్వామ్యంతో ఓ మెడికల్ కౌన్సిల్ సెంటర్‌ను స్థాపించారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి నిమిష ప్రియను వేధించడం, పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లను లాక్కున్నాడనే ఆరోపణలున్నాయి. 2016లో ఆమె తలాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తన పాస్‌పోర్టు తీసుకోవాలని అనుకున్న నిమిష 2017లో తలాల్‌ మెహదికి మత్తుమందు ఇచ్చింది. కానీ దాని డోసు ఎక్కువ కావడంతో తలాల్ మెహదీ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత నిమిష అతడి మృతదేహాన్ని వాటర్‌ ట్యాంక్‌లో పడేసింది. అక్కడి నుంచి సౌదీ పారిపోతుండగా సరిహద్దుల్లో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. చివరికి మరణశిక్ష విధించారు. ఈ ఏడాది జులై 26న ఈ శిక్షను అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో భారత ప్రభుత్వం, మత పెద్ద ప్రయత్నాల వల్ల ఆమె ఉరిశిక్ష వాయిదా పడింది.

నిమిషా ప్రియ తల్లి ఎవరు?

ప్రియ తల్లి ప్రేమ కుమారి , కేరళకు చెందిన గృహ కార్మికురాలు, తన కూతురి న్యాయ ఖర్చుల కోసం తన ఇంటిని అమ్మేసింది, ఆమె విడుదల కోసం చర్చలను సులభతరం చేయడానికి ఒక సంవత్సరానికి పైగా యెమెన్‌లో ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read also :

death penalty Human Rights India-Yemen Relations Indian Nurse in Yemen international law Legal Update Nimisha Priya Nimisha Priya Case Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.