📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

News Telugu: VISA- వీసా కాలపరిమితి మరోసారి కుదించిన ట్రంప్

Author Icon By Sharanya
Updated: August 28, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

News Telugu: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటూ, ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ప్రత్యేకంగా వలస వాదులపై తన ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. అక్రమవలసవాదులను బలవంతంగా స్వదేశాలకు పంపిన విషయం విధితమే. అంతేకాదు వీసాలపై కఠిన ఆంక్షల్ని తీసుకొచ్చారు. తాజగా వీసాల జారీపై కాలపరిమితిని విధించింది. కొత్త రూల్ ప్రకారం యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలపై కాలపరిమితిని విధించింది. ఇకపై విదేశీ విద్యార్థులు నాలుగేళ్లకు మించి ఉండకుండా వీసా నిబంధనలను కఠినం చేయనుంది.

News Telugu

నాలుగేళ్లు మాత్రమే ఉండాలి

ప్రస్తుతం విదేశీ విద్యార్థులు ఎఫ్ 1వీసా (F1 visa)లపై అమెరికాలో చదువుకోవడానికి వస్తున్నారు. ఎక్స్ఛేంజ్ విజిటర్లు జే 1 వీసాలపై వస్తున్నారు. అయితే వీరి వీసా గడువు అయిపోయాక కూడా డ్యూరేషన్ ఆఫ్ స్టే తెచ్చుకుని అమెరికాలో ఉండొచ్చు. వారు ఎంతకాలం చదవాలనుకుంటే లేదా ఇంటర్న్ ప్రోగ్రామ్లో పాల్గొనాలనుకుంటే అంతకాలం ఉండొచ్చు. ఎక్స్ఛేంజ్ విజిటర్స్ గా వచ్చే విద్యార్థులు, ప్రొఫెసర్లు, స్కాలర్లు, స్పెషలిస్టులు, ట్రైనీలు, ఇంటర్న్లు, ఫిజీషియన్లకు కూడా ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇప్పుడు దీన్నే మార్చేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సిద్ధమైంది. ఇక మీదట ఈ వీసాలకు కొంతకాలం మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఈ కొత్తరూల్ భారత విద్యార్థులపై అత్యధిక ప్రభావం చూపనుంది. ప్రస్తుతం 3.3లక్షల మందికి పైగా భారతీయులు అమెరికా వర్సిటీల్లో చదువుకుంటున్నారు. చదువు తర్వాత అమెరికా (America) లోనే ఉండి ఉద్యోగాలు సంపాదించుకుంటారు చాలామంది ఇకమీదట అలా చేయడం కుదరదు.

కొత్త నిబంధనలు ఇవే..

ఈ కొత్తప్రతిపాదనలను రేపు ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రతిపాదనపై 30 నుంచి 60 రోజుల వరకు ప్రజాభిప్రాయాన్ని స్వీకరించి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. మరోవైపు ఇలాంటి ప్రజాభిప్రాయాలు ఏమీ లేకుండానే తక్షణమే అమల్లోకి వచ్చేలా దీనిపై మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎఫ్, జే వీసా పొందిన విదేశీ విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు అమెరికాలో చదువుకునేందుకు గరిష్ట కాలపరిమితి నాలుగేళ్లుగా నిర్ణయించారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/usa-shooting-at-american-school/international/536827/

Breaking News Donald Trump H1B visa immigration policy latest news Student visa Telugu News Trump decision US Immigration USA visa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.