పాకిస్థాన్‌లో (Pakistan Spying) ప్రజలపై నిఘా కొనసాగుతోందని, లక్షలాది మొబైల్ వినియోగదారులపై గూఢచర్యం జరుగుతోందని అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ (Amnesty International) వెల్లడించింది. “ఫోన్ ట్యాపింగ్, ఇంటర్నెట్ ఫైర్‌వాల్ సిస్టమ్‌ల ద్వారా అక్కడి ప్రభుత్వం పౌరుల వ్యక్తిగత హక్కులను ఉల్లంఘిస్తోంది” అని ఆ సంస్థ తాజాగా విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. ఆమ్నెస్టీ నివేదిక ప్రకారం, పాకిస్థాన్‌లో “లాఫుల్ ఇంటర్‌సెప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (LIMS)” అనే సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి లక్షలాది ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నారు. దాదాపు 40 లక్షల మొబైల్ ఫోన్ల నుంచి జరగుతున్న కాల్స్‌ను రికార్డ్ చేసి, అవసరమైతే వాటిని విశ్లేషించే అధికారం గూఢచారి సంస్థలకు ఉన్నట్లు చెబుతోంది. ఇది నేరుగా ప్రజల వ్యక్తిగత గోప్యతకు ముప్పు అని ఆమ్నెస్టీ పేర్కొంది.
చైనా టెక్నాలజీ మద్దతు
రిపోర్ట్‌లో మరో ముఖ్యాంశం ఏమిటంటే, పాకిస్థాన్ ఈ నిఘా వ్యవస్థను చైనీస్ టెక్నాలజీ సహాయంతో అమలు చేస్తోందని సమాచారం. చైనా నిర్మించిన ఇంటర్నెట్ ఫైర్‌వాల్ (Internet firewall) ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలను బ్లాక్ చేయడం, వెబ్‌సైట్లను నిలిపివేయడం జరుగుతోందని వెల్లడించారు. అదేవిధంగా, పాశ్చాత్య టెక్నాలజీ సాయంతో మానిటరింగ్ నెట్వర్క్‌ను మరింత బలపరిచినట్లు నివేదిక చెబుతోంది.
News Telugu
వెబ్‌సైట్లు, సోషల్ మీడియాపై ఆంక్షలు
“డబ్ల్యూఎంఎస్ 2.0 ఫైర్‌వాల్” ద్వారా ఒకేసారి 20 లక్షల యాక్టివ్ యూజర్ల ఇంటర్నెట్ యాక్సెస్‌ను నిలిపివేయగల సామర్థ్యం ఉందని ఆమ్నెస్టీ తెలిపింది. దీని ద్వారా వెబ్‌సైట్లను బ్లాక్ చేయడం, సోషల్ మీడియాలో పోస్ట్‌లు ఆపేయడం, కొంతమంది యూజర్లను టార్గెట్ చేయడం జరుగుతోందని పేర్కొంది. ఇది ప్రజల భావప్రకటన స్వేచ్ఛను తీవ్రంగా దెబ్బతీస్తుందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
మొబైల్ ఆపరేటర్లపై ఒత్తిడి
దేశంలోని నాలుగు ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ సంస్థలకు ఎల్ఐఎంఎస్ సిస్టమ్‌కి కనెక్ట్ కావాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఆమ్నెస్టీ వెల్లడించింది. దీంతో ఈ ఆపరేటర్లు వినియోగదారుల సమాచారం నేరుగా ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు చేరేలా చేస్తున్నారని ఆరోపించింది.
రాజకీయ, మీడియా స్వేచ్ఛపై ప్రభావం
ఇప్పటికే పాకిస్థాన్‌లో మీడియా స్వేచ్ఛ, రాజకీయ స్వేచ్ఛపై అనేక ఆంక్షలు ఉన్నాయని రిపోర్ట్ గుర్తు చేసింది. పత్రికా ప్రతినిధులు, ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పలేని పరిస్థితి ఏర్పడిందని ఆమ్నెస్టీ పేర్కొంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్, సోషల్ మీడియా సెన్సార్‌తో పరిస్థితి మరింత దిగజారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: