📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US Rules: విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!

Author Icon By Sudheer
Updated: July 21, 2026 • 8:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

US Rules: అమెరికాలో చదువుకుంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ (D/S) విధానాన్ని రద్దు చేస్తూ, విద్యార్థుల బసపై గరిష్ఠంగా నాలుగేళ్ల నిర్దిష్ట కాలపరిమితి (Fixed Period of Admission) విధించింది. కొత్త నిబంధనల ప్రకారం కోర్సు కాలపరిమితి లేదా గరిష్ఠంగా 4 సంవత్సరాల వరకు మాత్రమే యుఎస్‌లో ఉండేందుకు అనుమతి లభిస్తుంది. ఒకవేళ పిహెచ్‌డీ లేదా సుదీర్ఘమైన కోర్సులు చేసేవారు నాలుగేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండాల్సి వస్తే, యూఎస్‌సిఐఎస్ (USCIS)కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని గడువు పెంపు (Extension of Stay) పొంది, అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

Read Also ; నీట్ యూజీ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే!

Students in USA

సెప్టెంబర్ 15 డెడ్‌లైన్: పాత విద్యార్థులకు ఊరట

ఈ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపు ఇప్పటికే అమెరికాలో ఉండి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థులకు మినహాయింపునిచ్చారు; వారు పాత ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ నిబంధనల పరిధిలోనే కొనసాగుతారు. అయితే, సెప్టెంబర్ 15 తర్వాత యుఎస్‌లో అడుగుపెట్టే కొత్త విద్యార్థులకు మాత్రం ఈ నాలుగేళ్ల పరిమితి నిబంధన వర్తిస్తుంది. అంతేకాకుండా, కోర్సు పూర్తయిన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు లేదా ఇతర కేటగిరీకి మారేందుకు ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను కూడా 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

DHS Fixed Period of Admission Rule Google News in Telugu Latest News in Telugu Telugu News trump US Student US Student Visa Duration of Status Vaartha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.