📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం హైదరాబాద్‌లోని రోడ్డుకు ట్రంప్ పేరు? పుతిన్‌కు రాష్ట్రపతి భవన్​లో స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికుల ఇక్కట్లు భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్

Latest Telugu News: Insurance: ఇన్సూరెన్స్ పాలసీ రూల్స్ మారాయి.. కొత్త రూల్స్ ఇవే

Author Icon By Vanipushpa
Updated: December 9, 2025 • 2:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇన్సూరెన్స్(Insurance) రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం అందించేందుకు ఉద్దేశించిన insurance ombudsman rules 2025ని ఇటీవల విడుదల చేసింది. ఇందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే.. ఇన్సూరెన్స్ కంపెనీల క్లెయిమ్ తిరస్కరణలు, చెల్లింపుల్లో లేటు, కంప్లెయింట్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే.. ఫిర్యాదుల పరిష్కార విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి.

Read Also: Flight Crash: ల్యాండింగ్ సమయంలో శిక్షణ విమానం ప్రమాదం

Insurance

పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు ఉండవు

ప్రతి కంపెనీలో ఒక స్వతంత్ర అధికారి ప్రస్తుతం పాలసీదారుల ఫిర్యాదులపై ఇన్సూరెన్స్ కంపెనీలే తమ నిర్ణయాలను సమీక్షించుకునే విధానం ఉంది. ఇది అన్యాయంగా ఉంటోందని గుర్తించిన IRDAI.. ఈ విధానాన్ని మార్చేందుకు నడుం బిగించింది. కొత్త రూల్స్ ప్రకారం.. మూడేళ్లుగా పనిచేస్తున్న ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ (రీ-ఇన్సూరెన్స్ మినహా) ఒక ‘అంతర్గత ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్‌’ను నియమించాలి. ఆ అధికారికి ఇన్సూరెన్స్ రంగంలో కనీసం 20 ఏళ్ల అనుభవం ఉండాలి. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆ అధికారి ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి లేదా దాని గ్రూప్ కంపెనీలకు ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగి కాకూడదు. ఈ అంబుడ్స్‌మన్‌ జీతం పూర్తిగా స్థిరంగా (Fixed) ఉంటుంది. పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు ఉండవు. దీని ఉద్దేశం.. వ్యాపార ఒత్తిడి లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడం.

30 రోజుల్లోగా స్పందన రాకపోతే అంబుడ్స్‌మన్‌కు వెళ్లవచ్చు

ముఖ్యంగా.. ఈ అంబుడ్స్‌మన్ ఇచ్చే తుది నిర్ణయం ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టుబడి ఉంటుంది. ఇది పాత విధానానికి పూర్తి విరుద్ధం. గతంలో అంతర్గత నిర్ణయాలను కంపెనీలు సులభంగా పక్కన పెట్టేవి. మొదట మధ్యవర్తిత్వం (Conciliation) ద్వారా పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. అది విఫలమైతే.. కేసు మెరిట్ల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. టైం లిమిట్స్ ఇలా.. ఆలస్యాన్ని అరికట్టడానికి పటిష్టమైన కాలపరిమితులను ప్రతిపాదించాయి. క్లెయిమ్ తిరస్కరణ లేదా 30 రోజుల్లోగా స్పందన రాకపోతే అంబుడ్స్‌మన్‌కు వెళ్లవచ్చు. అంబుడ్స్‌మన్‌కు చేరిన తర్వాత 15 రోజుల్లోగా పరిష్కరించాలి. నిర్ణయాన్ని 3 రోజుల్లోగా తెలియజేయాలి. తుది ఆదేశాన్ని 7 రోజుల్లోగా తప్పనిసరిగా అమలు చేయాలి. ఆర్థిక జరిమానా.. క్లెయిమ్ చెల్లింపులో లేట్ జరిగితే.. మొదటిసారి క్లెయిమ్ చేసిన తేదీ నుండి బ్యాంక్ రేటుతో పాటు అదనంగా 2% వడ్డీని పాలసీదారుడికి చెల్లించాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Breaking News in Telugu Consumer Rights Financial Regulations Google News in Telugu Insurance Policy Changes Insurance Sector Latest In telugu news New Insurance Rules Policy Guidelines Policy Updates Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.