📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

ట్రంప్ ప్రమాణంతో గర్భిణులకు కొత్త కష్టాలు

Author Icon By Vanipushpa
Updated: January 23, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

డొనాల్డ్ ట్రంప్ నూతన అధ్యక్షుడుగా ప్రమాణం చేయడంతో అమెరికాలోని విదేశీయుల గుండెలో రైలు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ గర్భిణీ స్త్రీలు అయితే.. ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. తమకు నెలల నిండకపోయినా సరే ఆపరేషన్లు చేసైనా డెలివరీ చేయాలంటూ వైద్యులను కోరుతున్నారు. దాని వల్ల తల్లీబిడ్డలు ఇద్దరికీ ప్రమాదం అని తెలిసినా లెక్కచేయకుండా.. సీ సెక్షన్లు చేయించుకోవాలని అనుకుంటున్నారు. ఇటీవలే అమెరికా ఎన్నికల్లో విజయం సాధించి.. జనవరి 20వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు డొనాల్డ్ ట్రంప్. అయితే పదవీ బాధ్యతలు చేపట్టిన తొలిరోజే.. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేశారు. ముఖ్యంగా విదేశాల నుంచి అక్రమంగా వలసలు వచ్చి ఉంటున్న వారికి బిడ్డలు పుడితే.. వారికి తమ దేశ పౌరసత్వం ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో విదేశీ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికే గర్భం దాల్చిన పలువురు విదేశీ మహిళలు.. జన్మతః పౌరసత్వం రద్దు గడువు తేదీలోగానే పిల్లల్ని కంటే తమ బిడ్డలకు ఆ దేశ పౌరసత్వం లభిస్తుందని ఆశ పడుతున్నారు.

ఇందుకోసమే గర్భం దాల్చి 6 నెలల నిండిన వాళ్లంతా ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీ లోపే ఈ డెలివరీలు చేయాలని కోరుతున్నారట. 8, 9 నెలల నిండిన వారికి సీ సెక్షన్లు చేస్తే పెద్దగా ప్రమాదం లేకపోయినా.. 6, 7 నెలల వారికి సిజేరియన్లు చేయడం మంచిది కాదని అక్కడి వైద్యులు చెబుతున్నారు. వైద్యులు వారికీ కౌన్సిలింగ్‌లు కూడా ఇస్తున్నారట. ముఖ్యంగా నెలలు నిండక ముందే పుట్టే పిల్లల్లో ఊపిరితిత్తులు, జీర్ణ సంబంధిత సమస్యలు, తక్కువ బరువుతో పుట్టడం, నరాల బలహీనతతో పాటు అనేక సమస్యలు వస్తాయని వివరిస్తున్నారట. టెక్సాస్‌లోని ఓ ప్రసూతి ఆస్పత్రికి చెందిన వైద్య నిపుణుడు మాట్లాడుతూ.. గత రెండు రోజుల్లోనే తన వద్దకు 20 మందికి పైగా జంటలు సీ సెక్షన్లు చేయమని వచ్చారని తెలిపారు.

Donald Trump pregnant woman president USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.