📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest Telugu News: India: పుతిన్ వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు వెతుకులాట

Author Icon By Vanipushpa
Updated: December 4, 2025 • 5:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) నాలుగేళ్ల తర్వాత భారత్‌కు విచ్చేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ కానున్నారు. ఈ క్రమంలోనే భారత్‌, రష్యా వార్షిక సదస్సులో ప్రధాని మోదీ, పుతిన్ పాల్గొననున్నారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు జరగనున్నాయి. పుతిన్‌ భారత్‌కు రానున్న నేపథ్యంలో ఆయన వ్యక్తిగత వివరాల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. అయితే పుతిన్ తన వ్యక్తిగత, కుటుంబ వివరాలను చాలాకాలం పాటు మీడియాకు దూరంగా ఉంచారు.

Read Also: Donald Trump: క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

India and Russia

పుతిన్ కు ఇద్దరు కుమార్తెలు

ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ కుటుంబ సభ్యుల్లో కొందరు ఇటీవల బహిరంగంగా కనిపించారు. ఆయనకు 1983లో ల్యుడ్మిలా అలెక్సాండ్రోవ్నా ష్క్రీబ్నేవాను పెళ్లి చేసుకున్నారు. ఆమె లెనిన్‌గ్రాడ్ యూనివర్సిటీలో ఫిలాలజీ ఫ్యాకల్టీ గ్రాడ్యుయేట్. అలాగే జర్మన్‌ టీచర్‌ కూడా. పుతిన్, ల్యూడ్మిలా వ్యక్తిగత కారణాలతో 2014లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఒకరు మరియా పుతినా (40), మరొకరు కటెరినా తిఖోనోవా (39). 1985లో మరియా పుతినా జన్మించారు. ఈమె వయసు 40 ఏళ్లు.

పుతిన్‌కు ముగ్గురు అక్రమ సంతానం?

కటెరినా 1986లో జన్మించారు.ఈమె వయసు 39 ఏళ్లు. కటెరినా రష్యన్ శాస్త్రవేత్త, గతంలో అక్రోబేటిక్ డ్యాన్సర్‌గా కూడా విన్యాసాలు చేశారు. పుతిన్ కుమార్తెలిద్దరు ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడగలరు. ఆయన పెద్ద కూతురు మరియాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2017లో తాను తాతనయ్యానని పుతిన్ బహిరంగంగా ప్రకటించారు. అంతేకాదు 2024 సంవత్సరాన్ని పుతిన్ కుటుంబ సంవత్సరంగా కూడా ప్రకటించారు. పుతిన్‌కు బంధువైన అన్నాత్సివిలేవా.. 2023లో ‘డిఫెండర్స్ ఆఫ్ ది ఫాదర్‌ ల్యాండ్ ఫౌండేషన్’కు అధిపతిగా నియమించబడ్డారు. 2024లో ఆమె డిప్యూటీ డిఫెన్స్‌ మినిస్టర్‌గా నియమించబడ్డారు. ఇదిలాఉండగా పుతిన్‌కు ముగ్గురు అక్రమ సంతానం కూడా ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Breaking News in Telugu Google News in Telugu India Visit Latest In telugu news online trends Public Curiosity Putin Personal Details Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.