📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Netanyahu: ట్రంప్ ను ఎలా మేనేజ్ చేయాలో మోదీకి చెబుతా: నెతన్యాహు

Author Icon By Vanipushpa
Updated: August 8, 2025 • 4:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump)తో ఎలా వ్యవహరించాలనే అంశంపై భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొన్ని సలహాలు ఇవ్వగలనని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Netanyahu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ(Modi), అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ తనకు అత్యంత సన్నిహితులని పేర్కొంటూ, ఈ విషయంలో తాను సహాయపడగలనని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.
మోదీ, ట్రంప్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు: నెతన్యాహు
ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత జర్నలిస్టుల బృందంతో మాట్లాడుతూ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. “ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ ఇద్దరూ నాకు మంచి స్నేహితులు. ట్రంప్‌తో డీల్ చేసే విషయంలో మోదీకి కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే, ఆ విషయాలను నేను బహిరంగంగా కాకుండా పర్సనల్ గా చెబుతాను” అని స్పష్టం చేశారు. త్వరలోనే తాను భారత్‌లో పర్యటించాలని ఆశిస్తున్నట్లు కూడా నెతన్యాహు తన మనసులోని మాటను బయటపెట్టారు.

Netanyahu: ట్రంప్ ను ఎలా మేనేజ్ చేయాలో మోదీకి చెబుతా: నెతన్యాహు

అమెరికా-భారత్ మధ్య బలమైన సంబంధాలు
భారత ఉత్పత్తులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత వస్తువులపై 50 శాతం వరకు సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయకపోతే మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. ఈ వాణిజ్య వివాదంపై నెతన్యాహు స్పందిస్తూ, అమెరికా-భారత్ మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని, సుంకాల సమస్యను ఇరు దేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆకాంక్షించారు.

ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి సహకారం: నెతన్యాహు

ఈ సమస్య పరిష్కారమైతే అది ఇజ్రాయెల్‌కు కూడా మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు పూర్తి సహకారం అందిస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు. నిఘా సమాచారాన్ని పరస్పరం పంచుకుంటూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. కాగా, గురువారం ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి జేపీ సింగ్‌తో నెతన్యాహు సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చించినట్లు తెలుస్తోంది.

బెంజమిన్ నెతన్యాహు ఎవరు?

బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ రాజకీయ నాయకుడు మరియు లికుడ్ పార్టీకి చెందినవాడు. అతను మూడుసార్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రిగా పనిచేశాడు: 1996-1999, 2009-2021, మరియు 2022 నుండి ఇప్పటి వరకు. 

Global Politics India Israel ties Modi Netanyahu relations Netanyahu on Trump Telugu News Trump Diplomacy US foreign policy World leaders

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.