📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Russia: పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే మాజీ మంత్రి ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: July 8, 2025 • 11:36 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రష్యా(Russia) మాజీ రవాణా మంత్రి రోమన్ స్టారోవైట్(roman starovoit) సోమవారం తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​(Putin) ఆయనను పదవి నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే ఇలా జరగడం గమనార్హం. స్టారోవైట్​ మాస్కో(Mascow) శివారులో తనను తాను కాల్చుకున్నట్లు రష్యన్ వార్తా సంస్థలు చెబుతున్నాయి. స్టారోవైట్( starovoit)​ మృతదేహం ఆయన కారులోనే లభించిందని ఆ దేశ దర్యాప్తు కమిటీ తెలిపింది.

కారణం చెప్పకుండానే పదవి నుంచి తొలగింపు
రష్యా అధికారిక సమాచార పోర్టల్ ప్రకారం, అధ్యక్షుడు పుతిన్​ ఓ డిక్రీ ద్వారా రవాణా మంత్రిగా ఉన్న రోమన్ స్టారోవైట్​ను పదవి నుంచి తొలగించారు. కానీ అందుకు గల కారణాలు వెల్లడించలేదు.

దాదాపు 5 ఏళ్లపాటు గవర్నర్​గా పనిచేశారు

వాస్తవానికి రోమన్ స్టారోవైట్ ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉండే కుర్స్క్​ ప్రాంతానికి దాదాపు 5 ఏళ్లపాటు గవర్నర్​గా పనిచేశారు. తరువాత ఆయన 2024 మేలో రష్యా రవాణా మంత్రిగా నియమితులయ్యారు. అంటే సుమారు ఒక ఏడాది క్రితమే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కానీ ఆయనను పుతిన్ అర్ధాంతరంగా పదవి నుంచి తొలగించి, నోవ్​గోరోడ్ ప్రాంత మాజీ గవర్నర్​ ఆండ్రీ నికితిన్​ను తాత్కాలిక రవాణా మంత్రిగా నియమించారు. ఈ విషయాన్ని క్రెమ్లిన్ అధికారికంగా వెల్లడించింది.స్టారోవైట్​ను తొలగించి నికితిన్​ను రవాణా మంత్రిగా నియమించడానికి గల కారణం ఏమిటనే ప్రశ్నకు, క్రెమ్లిన్ ప్రతినిథి దిమిత్రి పెస్కోవ్​, “అధ్యక్షుని అభిప్రాయం ప్రకారం, ఆండ్రీ నికితిన్​కు ప్రొఫెషనల్ క్వాలిటీస్​తో పాటు చాలా ఎక్స్​పీరియన్స్​ ఉంది. ఇవి ఆయనకు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తించడానికి దోహదపడతాయి. అందుకే ఆయనకు రవాణా మంత్రి బాధ్యతలు అప్పగించారు” అని చెప్పారు.

Russia: పుతిన్ పదవి నుంచి తొలగించిన గంటల్లోనే మాజీ మంత్రి ఆత్మహత్య

గత నెల నుంచే
స్టారోవైట్​ను తొలగించి నికితిన్​ను నియమించాలనే ప్రణాళిక గత నెలలో సెయింట్​పీటర్స్​బర్గ్​లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్​)కు ముందు నుంచే ఉందని ట్రాన్స్​పోర్ట్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

ఆయనపై అవినీతి కుంభకోణం ఆరోపణలు
రష్యా వైమానయాన, షిప్పింగ్ రంగాలకు గత కొంతకాలంగా అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రోమన్ స్టారోవైట్​ను తొలగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇంతకు ముందు రష్యా విమానాలపై భారీ ఎత్తున డ్రోన్ దాడులు చేస్తామని ఉక్రెయిన్ బెదిరించింది. దీనిలో జులై 5-6 తేదీల్లో రష్యన్ విమానాశ్రయాల్లో దాదాపు 300 విమానాలు నిలిచిపోయాయి. ఈ గందరగోళానికి తోడు లెనిన్​గ్రాడ్​ ఒపబ్లాస్ట్​లోని ఉస్ట్​-లుగా ఓడరేవు వద్ద ఓ ట్యాంకర్​లో పేలుడు సంభవించింది. దీని కారణంగా భారీ స్థాయిలో అమ్మోనియా లీక్ అయ్యింది. ఇవన్నీ స్టారోవైట్​ పదవికి ఎసరుపెట్టాయి. దీనికి తోడు ఆయనపై కొన్ని నెలలుగా అవినీతి కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి.

రష్యాలోకి చొరబడిన ఉక్రెయిన్ సేనలు
కుర్స్క్​ గవర్నర్ పదవి వదిలి రవాణా మంత్రిగా స్టారోవైట్​ బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల తరువాత, ఆ ప్రాంతం గుండా ఉక్రెయిన్ సేనలు భారీగా రష్యాలోకి ప్రవేశించాయి. రెండో ప్రపంచ యుద్ధం తరువాత అంత పెద్ద ఎత్తున విదేశీ సైన్యాలు రష్యాలో ప్రవేశించడం ఇదే మొదటిసారి. కానీ తరువాత రష్యా చాకచక్యంగా ఉక్రెయిన్ దళాలను మళ్లీ వెనక్కు నెట్టివేయగలిగాయి. రోమన్‌ స్తారోవోయ్త్‌ ఉక్రెయిన్‌ సరిహద్దులోని కర్స్క్‌ రీజియన్‌లో జన్మించారు. 2024 నుంచి రష్యా రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. దానికన్నా ముందు ఐదేళ్లు కర్స్క్‌ రీజియన్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో ఫెడరల్‌ రోడ్‌ ఏజెన్సీ, పరిశ్రమల విభాగం లో కీలక విధులు నిర్వహించారు. .

Read Also: hindi.vaartha.com

Read Also: Brics: ట్రంప్‌ షాక్‌: బ్రిక్స్‌ అనుకూల దేశాలపై అదనపు సుంకాలు

#telugu News Gaza ceasefire talks Israel US relations Netanyahu Trump meeting Netanyahu White House visit Trump Nobel Peace Prize Trump nominated for Nobel

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.