📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Netanyahu – ఒంటరివాడవుతున్న నెతన్యాహు.. పాలస్తీనాకు పెరుగుతున్న మద్దతు

Author Icon By Anusha
Updated: September 18, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇజ్రాయెల్, హమాస్ లమధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే గాజా మట్టిదిబ్బగా మారుతున్నది. అక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లిపోతున్నారు. యుద్ధాన్ని ఆపాలని ఐక్యరాజ్యసమితితో పాటు పలు దేశాలు ఇజ్రాయెల్ ను కోరుతున్నా ఆ దేశ ప్రధాని నెతన్యాహు (Netanyahu) మొండివైఖరిని ప్రదర్శిస్తున్నారు.

తమ బందీలను వదిలేంత వరకు యుద్ధం ఆపబోమని, హమాస్ను పూర్తిగా నాశనం చేసేంతవరకు తమ పోరు కొనసాగుతుందని ఇటీవలే ఇజ్రాయెల్ పేర్కొంది.ఇప్పటికే పలుదేశాలు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు. ఇజ్రాయెల్ (Israel) ను అంతర్జాతీయంగా బహిష్కరణ దిశగా నెతన్యాహు నడిపిస్తున్నారని మాజీప్రధానులు ఎహుద్ బరాక్, ఎహుద్ ఓల్మెర్ట్లు ఆరోపిస్తున్నారు.

పాలస్తీనా రాజ్యంగా గుర్తింపు కోసం అడుగులు

ఐక్యరాజ్యసమితి (United Nations) లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడాతో సహా అనేక దేశాలు పాలస్తీనాను ఒక రాజ్యంగా గుర్తించాలని యోచిస్తున్నట్లు తెలిపాయి.ఇటీవల ఖతర హమాస్ నాయకులపై ఇజ్రాయెల్ దాడితో కోపంగా ఉన్న గల్ఫ్ దేశాలు దోహాలో సమావేశమయ్యాయి. ఈ దేశాలలో కొన్నింటికి ఇజ్రాయెల్తో సత్సంబంధాలు కూడా ఉన్నాయి.

ఇప్పుడా సంబంధాలను పునఃపరిశీలించే యోచనలో ఉన్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్న ఫొటోలు గాజా నుంచి వెలువడటం, ఇజ్రాయెల్ సైన్యం గాజా నగరంపై దాడి చేయడానికి ఇంకా సిద్ధమవుతుండడంతో, మరిన్ని యూరోపియన్ ప్రభుత్వాలు (European governments) ప్రకటనలను దాటి తమఅసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.

Netanyahu

బెల్జియం ఆంక్షలు

సెప్టెంబర్ ప్రారంభంలో బెల్జియం కీలక ఆంక్షలను ప్రకటించింది. వీటిలో వెస్ట్ బ్యాంక్లో ని అక్రమ యూదుస్థావరాల నుంచి దిగుమతులను నిలిపివేయడం,ఇజ్రాయెల్ కంపెనీలతో ఒప్పందాలను సమీక్షించడం, ఆ స్థావరాలలో నివసిస్తున్న బెల్జియన్లకు కాన్సులర్ యాక్సెస్ ను పరిమితం చేయడం వంటివి ఉన్నాయి.యూదు వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని స్పెయిన్ పై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ (Minister Gideon Sir) ఆరోపణలు చేశారు.

ఇజ్రాయెల్ కు అమెరికా నుంచి బలమైన మద్దతు కొనసాగుతోంది. జర్మనీ, ఇటలీ, హంగేరీ వంటి దేశాలు వాటిని వ్యతిరేకిస్తున్నందన వాణిజ్య ఒప్పందంలోని,కొన్నింటినిని తగ్గించడం లేదా ఈయూ హారిజన్ పరిశోధన కార్యక్రమం నుంచి ఇజ్రాయెల్ను నిరోధించడం వంటి ఈయూ పెద్ద చర్యలు అసంభవమని ఆయన,వివరించారు.

ప్రసాకర్తలను హాలీవుడ్ లో బహిష్కరించాలని పిలుపునిస్తూ

క్రీడా ప్రపంచంలో కూడా నిరసనలు చోటుచేసుకుంటున్నాయి. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ మారణహోమంను హాలీవుడ్ కూడా వ్యతిరేకిస్తున్నది.ఇజ్రాయెల్ ఫెస్టివల్స్, నిర్మాణ సంస్థలు, ప్రసాకర్తలను హాలీవుడ్ లో బహిష్కరించాలని పిలుపునిస్తూ ఎమ్మస్టోన్, జేవియర్ బార్డమ్ వంటి స్టార్లతో సహా నాలుగువేల మందికిఎపైగా ఒక లేఖపై సంతకం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/donald-trump-trump-declares-antifa-a-terrorist-organization/international/549748/

Breaking News civilian displacement gaza destruction Hamas international calls for ceasefire israel latest news middle east conflict netanyahu stance ongoing war Telugu News united nations appeal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.