📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest News: Nepal – మీకు లగ్జరీ లైఫ్.. మాకు పేదరికమా!

Author Icon By Anusha
Updated: September 12, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కొన్ని చిలిపిచేష్టలు లేదా సరదాల కోసం చేసే పనులే కొంపలు అంటుకునిపోతాయి. వాటి పర్యవస్థానం ఏమిటో గ్రహించేలోగా జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఏదో సరదాగా అలా పోస్ట్ చేశామని అనుకుంటారు యువత. కానీ ఆ సరదానే ఊహించని ఉపద్రవాలకు దారితీస్తుంది. సరిగ్గా నేపాల్లో ఇదే జరిగింది. ఒకవైపు నేపాల్ యువత (youth of Nepal) తీవ్రమైన,నిరుద్యోగం, పేదరికంతో అల్లాడుతున్నది. కానీ మంత్రులు, దేశాధినేతల పిల్లలు మాత్రం విదేశాల్లో విలాసవంతమైన జీవనాన్ని అనుసరిస్తున్నారు.

జెన్ జీ యువత ఉద్యమం చేయడానికి కారణం ఒక్క సోషల్ మీడియానే కాదు.. అక్కడి నెపోకిడ్స్ కూడా కారణమనే చెప్పాలి. నేపాల్ రాజకీయ నేతల పిల్లలు, వారి లగ్జరీ జీవితం, వాటిపై సోషల్ మీడియాలో,పోస్టులపై నేపాల్ యువత ఆగ్రహంగా ఉంది. సాధారణ నేపాలీలు నిరుద్యోగం, తీవ్ర పేదరికంతో పోరాడుతుంటే రాజకీయ నాయకుల పిల్లలు మాత్రం విలాసవంతమైన జీవితాలు,జీవిస్తున్నారని జెన్ జీ (Gen G) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇదే తిరుగుబాటుకు కేంద్రంగా మారింది.

ఊహించని నష్టం, దాడులు

నేపాల్ లో సోషల్ మీడియా (Social media) బంద్ చేశారనే ఆగ్రహంతో నేపాల్ జెన్ జీ కిడ్స్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇది కాస్తా హింసాత్మకంగా మారింది. దీనికారణంగా 34మంది,చనిపోగా మరో 1338మంది గాయపడ్డారు. మాజీ ప్రధాని భార్యను సజీవదహనం చేశారు. మంత్రులపై వీధుల్లోనే భౌతిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగక పార్లమెంట్,సుప్రీంకోర్టు, ప్రధాని అధికార నివాసాలకు నిప్పు పెట్టారు. మంత్రుల ఇండ్లలోకి వెళ్లి వారిపై దాడి చేశారు. దీంతో వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, పరుగులు తీశారు.

Nepal

వైరల్ గా మారిన లగ్జరీ లైఫ్ ఫోస్టులు

నేపాల్ రాజకీయ నేతల పిల్లల విలాస జీవనశైలి హైలెట్ చేసే పోస్ట్లు, వీడియోలు టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్, రెడ్ ఇట్ లాంటి వాటిల్లో విస్తృతంగా వ్యాపించాయి. నేపాల్ నెపో కిడ్స్ లో,మాజీ మిస్ నేపాల్, మాజీ ఆరోగ్యమంత్రి బిరోద్ ఖతివాడ కుమార్తె శృంఖల ఖతివాడా (Shrinkhala Khatiwada is the daughter of former Health Minister Birod Khatiwada.) ఉన్నారు. ఈమె సోషల్ మీడియా నిండా విదేశీ ప్రయాణాలు, లగ్గరీ లైఫ్ కు సంబంధించిన,పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో నిరసనకారులు ఆమె ఇంటిని తగులబెట్టారు. దీని తర్వాత ఆమె ఇన్స్టాగ్రామ్ లో లక్షమందికి పైగా ఫాలోవర్స్ ను కోల్పోయారు.

ఖరీదైన ఫ్యాషన్ సామాగ్రి, గృహాల పోస్టులు

నేపాల్ గాయని, మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా కోడలు శివనా శ్రేష్టా పోస్ట్లు కూడా వైరల్ అయ్యాయి. ఈమె తరచుగా విలాసవంతమైన గృహాలు, ఖరీదైన ఫ్యాషన్ సామాగ్రిని ప్రదర్శించే వీడియోలను పోస్ట్ చేసేవారు. ఈమె భర్త కోట్లకు అధిపతి. మాజీ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ మనవరాలు స్మితా దహల్ లక్షల్లో విలువైన హ్యాండ్బ్యాగలను ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసేవారు. ఇక ఈ మంత్రుల అవినీతి గురించి చెప్పనక్కర్లేదు. ఇవన్నీ నేపాల్ యువత ఆగ్రహానికి దారితీసి, ఉద్యమజ్వాలలు రగిల్చాయి. దేశం అట్టుడికిపోయేలా చేసింది. ప్రధాని తన పదవికి రాజీనామా చేసి, దుబాయికి పారిపోయేలా చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/attack-devotees-narrowly-escape-attack-on-indian-bus-in-nepal/international/545831/

Breaking News foreign countries latest news luxurious lifestyle ministers’ children nepal Poverty social unrest Telugu News unemployment youth of Nepal youth struggles

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.