📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి విదేశీ చదువుల్లో ఏపీ స్టూడెంట్స్ టాప్ సోషల్ వెట్టింగ్ తో భారత్ కు భారీ కుదుపు! భారత్ లో వీసా సర్వీసులను నిలిపేసిన బంగ్లాదేశ్ కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం ఇండోనేషియాలో రోడ్డుప్రమాదం.. 16 మంది దుర్మరణం ట్రంప్ ప్రకటనలో భారీగా తగ్గనున్న మందుల ధర ఢాకాలో హింస.. పత్రికల కార్యాలయాలపై దాడులు

Latest News: Nepal – నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి ప్రమాణస్వీకారం

Author Icon By Anusha
Updated: September 13, 2025 • 2:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎట్టకేలకు నేపాల్ (Nepal) ప్రజలు శాంతించారు. గత ఐదురోజులుగా నేపాల్ లో చెలరేగిన హింస కారణంగా 51మంది మరణించగా వందల్లో ప్రజలు గాయపడ్డారు. మంత్రుల ఇళ్లపై నిరసనకారులు దాడులు చేసి, వారిపై దాడులకు పాల్పడ్డారు. పార్లమెంట్, ప్రధాని అధికారిక భవనం, సుప్రీంకోర్టు వంటి ప్రభుత్వ ఆస్తులను తగులబెట్టారు. మాజీ ప్రధాని భార్యను సజీవ దహనం చేశారు. జెన్ జెడ్ యువత (Gen Z youth) దేశవ్యాప్తంగా చేసిన ఆందోళనలు తీవ్రహింసాత్మకంగా మారడంతో ప్రధాని ఓలీ తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

దీంతో కొత్త ప్రధానిని ఎంపిక చేశారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంతో నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి (Sushila Karki) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడి కార్యాలయంలో 73 ఏళ్ల సుశీల కర్కితో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఎన్నికల వరకు సుశీల కర్కి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తారు.

Nepal

విమాన హైజాక్లో సుశీల భర్త సుబేది..

ప్రధాని సుశీల కర్కి భర్త పేరు దుర్గా ప్రసాద్ సుబేది (Durga Prasad Subedi). 1973లో నేపాల్ లో విమానం హైజాక్ చేశారు. ఈ విమానం హైజాక్లో దుర్గాప్రసాద్ సుబేది కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఈ విమానంలో భారత్ కు చెందిన వారు కూడా ఉన్నారు. నేపాల్ రాజు మహేంద్ర పాలనలో రాజరికానికి వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి నిధులు సేకరించడానికి ఈ విమాన హైజాక్ జరిగింది.

ఈ విమానంలో 30లక్షల ప్రభుత్వ నిధులు ఉన్నాయి. దీంతో హైజాకర్లు పైలట్ (pilot) ను బీహార్లోని పోర్బ్స్ గంజ్లోని గడ్డి మైదానంలో బలవంతంగా దిగారి. అనంతరం విమానాన్ని వదిలేసి, పారిపోయారు. దీంతో పోలీసులు సుబేదిని అరెస్టు చేయాల్సి వచ్చింది. కొన్నేళ్ల తర్వాత హైజాకర్లు జైలు నుంచి విడుదల అయ్యారు. ఇలా తాత్కాలిక ప్రధాని సుశీల కర్కి భర్త విమానం హైజాక్ చేసిన నేరస్తులలో ఒకరుగా మిగిలిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/america-charlie-kirk-murder-case-how-the-father-caught-the-murderer/international/546549/

Breaking News emergency situation former chief justice interim prime minister latest news nepal new prime minister President Ramchandra Paudel Sushila Karki sworn in Friday Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.